19, జనవరి 2024, శుక్రవారం

జీడీ నెల్లూరు రాజకీయంలో గెలుపు ఎవరిది ?

ఓడి గెలిచిన నారాయణ స్వామి 
గెలిచి ఓడిన జ్ఞానేంద్ర రెడ్డి 
విభేదాల ముందు  ఓడిన పార్టీ క్రమశిక్షణ
గాలికి కొట్టుకుపోయిన పార్టీ పరువు
సీరియస్ గా తీసుకున్న అధిష్టానం
జిల్లా అధ్యక్షుడు ఆరా, నివేదిక సమర్పణ

గంగాధర నెల్లూరు రిజర్వుడు నియోజక వర్గం రాజకీయాలు బలే ఆసక్తికరంగా మారాయి. పాత మిత్రులైన డిప్యూటీ సిఎం కె నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు ఎం జ్ఞానేంద్ర రెడ్డి మధ్య ప్రక్షన్న రాజకీయ పోరు నెల కొన్నది. స్వామికి టికెట్టు వద్దంటూ జ్ఞానేంద్ర అధిష్టానంపై వత్తిడి తెచ్చారు. ఆయన అనుకున్నట్టే జగన్, స్వామిని ఎమ్మెల్యేగా తొలగించి చిత్తూరు లోక్ సభ టికెట్టు ఇచ్చారు. 

దీనితో ఒక విధంగా ఆయనకు ప్రమోషన్ ఇచ్చినట్టు అయింది. ఎమ్మెల్యే కంటే ఎంపీకి  ఎక్కువ విలువ ఉంటుందనడంలో సందేహం లేదు.దీనితో నారాయణ స్వామి ఎమ్మెల్యే టికెట్టు ఓడి ఎంపి టికెట్టు గెలిచారని అంటున్నారు. అలాగే జ్ఞానేంద్ర రెడ్డి స్వామికి ఎమ్మెల్యే టికెట్టు రాకుండా చేయడంలో విజయం సాధించారు. అయితే అయనకు ఎంపీ టికెట్టు రావడంతో ఓడి పోయినట్టు అయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

జ్ఞానేంద్ర రెడ్డి, నారాయణ స్వామి ఇద్దరు ఒకప్పుడు మంచి స్నేహితులు. 1981 లో జ్ఞానేంద్ర రెడ్డి గంగాధర నెల్లూరు సమితి అధ్యక్షుడుగా, నారాయణ స్వామి కార్వేటినగరం సమితి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే నాయకులుగా ఎదిగారు. నారాయణ స్వామి గెలుపుకు జి డి నెల్లూరులో రెండుసార్లు జ్ఞానేంద్ర రెడ్డి పని చేశారు. స్వామి వల్లనే ప్రభుత్వ సలహాదారు పదవి పొందారు. తన బంధువులకు పదవులు ఇప్పించుకున్నారు. 

అయితే పెనుమూరు మండలంలో జ్ఞానేంద్ర ఆధిపత్యానికి స్వామి అడ్డు తగలడంతో వివాదం మొదలయ్యింది. ఇదిలా ఉండగా నారాయణ స్వామికే జి డి నెల్లూరు టికెట్టు ఇవ్వాలని నియోజకవర్గంలో  పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాదంటే మూకుమ్మడి రాజీనామాలు  చేస్తామని హెచ్చరిస్తున్నారు.

జీడి నెల్లూరు పరిస్థితులపై జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ  భరత్ ఆరా


 గత రెండు రోజుల క్రితం వైసిపి పార్టీ అధిష్టానం చిత్తూరు ఎంపీ రెడ్డప్పని జీడి నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా, మంత్రి నారాయణ స్వామిని చిత్తూరు ఎం పి గా అధిష్టానం ప్రకటించింది.  ఈ క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచరులు కొంతమంది తిరిగి మళ్లీ జీడి నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా నారాయణస్వామిని ప్రకటించాలని ఆందోళన చేపట్టారు. ఈ విషయం జిల్లాలో  హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితులపై వైసీపీ పార్టీ అధిష్టానం మేరకు చిత్తూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ జీడి నెల్లూరులో జరుగుతున్న పార్టీ పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కొంతమంది వైసీపీ నాయకులను ఎమ్మెల్సీ భరత్ ఫోన్ సంభాషణలతో సమాచార సేకరించినట్లు తెలిసింది. 

ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీ నాయకులు భరత్ కి పలు విషయాలు చెప్పినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం మేరకు టికెట్ ఎవరికి ఇచ్చిన మేము గెలిపించికుంటామని చెప్పినట్లు సమాచారం. స్వామి పలుసార్లు మాకు ఫోన్లో ఫోన్లో ద్వారా చెప్పడంతో మార్గం లేక స్వామి అనుకూలంగా పత్రికా సమావేశం నిర్వహించామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి సన్నిహితుడైన ఓ సీనియర్ నాయకుడు చెప్పినట్లు సమాచారం. జీడి నెల్లూరులో  జరుగుతున్న పరిస్థితులను పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్సీ భరత్ నివేదిక పంపినట్లు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *