2, జనవరి 2024, మంగళవారం

జగన్ పై పూతలపట్టు ఎమ్మెల్యే తిరుగుబాటు !

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీట్లు కేటాయింపులు ఓసీలకు ఒక న్యాయము దళితులకు ఒక న్యాయమా అంటూ పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలతీశారు. జిల్లాలో దళిత నియోజకవర్గం ఎమ్మెల్యేలను మాత్రమే ఎందుకు మార్చుతున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దళితులపై జగన్ కక్ష కట్టారని ఆరోపించారు. దళితులుగా పుట్టడం నేను చేసిన నేరమా ? కర్మా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రానున్న ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు టికెట్ రాదని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి పిలిచి సమాచారం అందజేశారు. మీ మీద ఆరోపణలు, విమర్శలు ఉన్నాయని, సర్వే రిపోర్ట్ కూడా బాగాలేదని తెలిపారు. ఈసారి టిక్కెట్లు ఇవ్వడం లేదంటూ సున్నితంగా తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఎందుకు ఎమ్మెస్ బాబు అక్కడే తిరుగుబాటు దోరణిలో మాట్లాడారు. తాను చేసిన ఏం తప్పు చేశానని అడిగారు. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి, MP మిధున్ రెడ్డిలను ప్రస్తావిస్తూ నియోజకవర్గంలో ఇద్దరు రెడ్లు చెప్పినట్టుగానే నడుచుకున్నారని, వారి మీద లేని వ్యతిరేకత తన మీద ఎందుకు వస్తుందని అడిగారు. ఐ పాడ్ సర్వే కూడా సరైనది కాదని, డబ్బులు ఇస్తే నివేదికను తారుమారు చేస్తున్నారని పేర్కొన్నారు.

మంగళవారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికలలో ఏం ఏ సర్వే చూసి తనకు టికెట్ ఇచ్చారో తెలియజేయాలన్నారు. ఏ సర్వే లేకుండా, తనను నమ్మి టికెట్ ఇచ్చారని 35 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాలని వివరించారు. ఈసారి ఆరోపణలు ఉన్నాయి, సర్వే బాగాలేదు, టికెట్ ఇవ్వడం లేదు అంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాలు అన్ని పనులు మానుకొని గడపగడపకు తిరిగానని, వ్యాపారం, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టానన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు తనపై దాడి చేస్తే, నెలరోజులు కోమాలో ఉన్నానని, అధిష్టానం ఆ విషయాన్ని కూడా గుర్తించలేదన్నారు. దళితులు అంటే జగన్ కు ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలతో కలిసి మాట్లాడితే కదా తనంటే ఏమనేది తెలిసేదని అన్నారు. తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు ఉన్నారని వారిని పిలిపించే మాట్లాడాలని కోరారు.

 ఐపాడ్ సర్వే సక్రమంగా జరగలేదన్నారు. డబ్బులు ఇస్తే సర్వేను తారుమారు చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన విధంగానే నడుసుకున్నానని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి తనను పిలిచి మాట్లాడారా అని అడిగారు. తాను ఏవైనా తప్పులు చేసి ఉంటే అప్పుడే చెప్పాల్సిందన్నారు. తన మీద ఏమి వ్యతిరేకత ఉందో తనకు తెలియజేయాలన్నారు. తిరుపతి జిల్లాలో ఎవరిని మార్చలేదని, వ్యతిరేకత ఉన్న వాళ్ళని కూడా అలాగే కొనసాగించారన్నారు. జిల్లాలో దళిత నియోజకవర్గం అభ్యర్థులను మార్చడం ఏమిటని నిలదీశారు. జిల్లాలో దళితులకు ఒక న్యాయము, ఓసీలకు ఒక న్యాయమా ? తనకు సమాధానం చెప్పాలన్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉండి వైసీపీలో చేరామని, తమ సేవలను గుర్తించలేదని ఎమ్మెస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *