2, జనవరి 2024, మంగళవారం

చిత్తూరు సీటు విజయానంద రెడ్డికే !

 


చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షుడు MC విజయానంద రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు చిత్తూరులో విజయానంద రెడ్డి అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. మంగళవారం తేదేపల్లిలో చిత్తూరు అసెంబ్లీ సీటుకు సంబంధించి పంచాయతీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, MP మిధున్ రెడ్డి, చిత్తూరు MLA జంగాలపల్లి శ్రీనివాసులు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మెన్ బుల్లెట్ సురేష్ పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో విజయానంద రెడ్డిని చిత్తూరు అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం. జంగాలపల్లి శ్రీనివాసులుకు రాజ్యసభ ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.


నెల రోజులకు ముందు చిత్తూరులో జరిగిన బస్సు యాత్రలో ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు తిరిగి MLA టికెట్ ను ఇవ్వనున్నట్లు మంత్రులు ప్రకటించారు. అప్పట్లో  మంత్రులు ఈ ప్రకటన చేయడాన్ని ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానంద రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అభ్యర్థి ప్రకటన చేయడానికి వారెవరు అని ప్రశ్నించారు. దీంతో పరిణామాలు చక చక మారినట్లు తెలుస్తోంది. పరిస్థితులు విజయానంద రెడ్డికి అకులంగా మారినట్లు సమాచారం.



 ఆర్టీసీ వైస్ చైర్మన్ గా నియమితులైన వ్యాపారవేత్త  విజయానంద రెడ్డి తొలినుంచి అసెంబ్లీ టిక్కెట్టు రేసులో ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అమలు చేస్తూ నియోజకవర్గ మీద పట్టు సాధిస్తున్నారు. చిత్తూరు ప్రజల అవసరాలను గుర్తించి నిధులను వ్యయం చేస్తూ, చిత్తూరు ప్రజలకు దగ్గర కావడానికి విజయానంద రెడ్డి పథక రచన చేశారు. ఇందులో భాగంగానే పెద్దిరెడ్డితో సన్నిహితంగా ఉంటూ  అభివృద్ధి కార్యక్రమాల అమలులో దూసుకుపోతున్నారు. చిత్తూరు మార్కెట్ కు వచ్చే వ్యాపారస్తులు, రైతులు మార్కెట్  చెస్ చెల్లించాల్సి ఉండేది. తోపుడుబండ్ల వర్తకులు, గంపల మీద అమ్ముకునే వాళ్ళు, రోడ్డుమీద అమ్ముకునే వారూ కూడా చెల్లించే వారు.  గత మూడు సంవత్సరాలుగా విజయానంద రెడ్డి ఆ పన్నులను గుంపత్తుగా మున్సిపాలిటీకి ఏడాదికి 75 లక్షల రూపాయలు చొప్పున కడుతున్నారు. కావున మున్సిపాలిటీకి పన్ను చెల్లించే అవసరం లేకుండా వ్యాపారస్తులు, రైతులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అలాగే ఎంత జంతువదశాలలకు కూడా పన్ను లేకుండా విజయానంద రెడ్డి చెల్లిస్తున్నారు. 



 చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఇదివరకు ఏ వాహనం వెళ్లినా పది నుండి 50 రూపాయల వరకు పార్కింగ్  ఫీజు వసూలు చేసేవారు. ఆ ఫీజును  విజయానంద రెడ్డి చెల్లిస్తూ రోగులు, రోగుల బంధువులు పార్కింగ్ ఫీజు చెల్లించే అవసరం లేకుండా చేశారు. రంజాన్ సమయంలో నియోజకవర్గంలోని ముస్లింలు అందరికీ రెండు కోట్ల రూపాయలతో రంజాన్ తోపాను అందజేశారు. అలాగే గతంలో నీవానదికి వరదలు వచ్చినప్పుడు వరద బాధితులను ఆదుకోవడంలోనూ, కరోనా సమయంలో కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవడంలోనూ విజయానంద రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. కరోనా సమయంలో పేదవారికి నిత్యవసరాలను కూడా సరఫరా చేశారు.  ప్రస్తుతం  PLR VNR టోర్నమెంట్ ను  చిత్తూరులో భారీ స్థాయిలో  విజయానంద రెడ్డి  నిర్వహిస్తున్నారు. ఇందులో 155 క్రికెట్ టీములు పాల్గొంటున్నాయి. వీళ్ళందరికీ క్రికెట్ కిట్లను ఉచితంగా అందజేశారు. విజేతకు రెండు లక్షల రూపాయలు బహుమతిని అందచేస్తారు. SR పురం మండలం స్వగ్రామం కొత్తపల్లి మిట్టలో 50కోట్ల రూపాయతో రెండు ఎకరాల స్థలంలో 10 అంతస్తుల భవనం హెలిపాడ్ సౌకర్యంతో స్మార్ట్ DV సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మించారు. 15 వేల మందికి ఉపాథి కల్పించడానికి సిద్దం అయ్యింది. త్వరలో ప్రారంభం కానుంది. మొదటి దశలో చిత్తూరు, గంగాధర నెల్లూరు నియోజక వర్గాలకు చెందిన 3 వేల మందితో ప్రారంభం కానుంది.



చిత్తూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి గుంతల మయం కావడంతో రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండగా 10 లక్షల రూపాయలతో ఓవర్ బ్రిడ్జి మరమ్మత్తు పనులను విజయానంద రెడ్డి చేపట్టారు. అలాగే చిత్తూరు పివికేఎన్ డిగ్రీ కళాశాల సమీపంలో వాకర్ అసోసియేషన్ కోరిక మేరకు 20 లక్షల రూపాయలతో ధ్యాన మందిరాన్ని నిర్మించారు. దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిరమిడ్ ధ్యాన మందిరంగా నామకరణం చేశారు. కార్యకర్తలు మరణించినా, ఆపదలో ఉన్న ఆపన్న హస్తము అందించి విజయానంద  రెడ్డి ఆదుకుంటున్నారు. ఇటీవల విజయానంద రెడ్డి జన్మదినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున నిర్వహించారు. చిత్తూరులోనే కాకుండా గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గం విజయానంద రెడ్డి జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఇలా తనదైన శైలిలో పార్టీ నేతల దృష్టిలో పడడానికి విజయానంద రెడ్డి పనిచేస్తూ, పార్టీ ప్రతిస్తాతను ఇముమడింప చేస్తున్నారు.



చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆకలిని తీర్చడానికి జగనన్న అన్న క్యాంటీన్ పేరుతో వారంలో ఏడురోజులూ ఉచిత అన్నదాన కార్యక్రమానికి విజయానంద రెడ్డి శ్రీకారం చుట్టారు. ఒక్కో రోజూ ఒక్కో ప్రాంతంలో అన్నదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా 4వ తేదిన జిల్లా సచివాలయం ( కలెక్టరేట్ )  రెడ్డిగుంట ఆవరణలో ఉదయం 11.00 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణస్వామి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం అయ్యింది. సోమవారం కలెక్టర్ ఆఫీసు వద్ద, మంగళవారం ఎస్టేట్ లోని కోర్టు వద్ద, బుధవారం పాత బస్టాండు వద్ద, గురువారం గాంధీ రోడ్ సర్కిల్ లో, శుక్రవారం మసీదుల వద్ద, శనివారం PCR సిర్సిల్, ఆదివారం చర్చి వీధిలోని చర్చి వద్ద  నిరాటంకంగా నడుస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *