చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి ఎవరు ?
ఈ నేపథ్యంలో కేవలం కుప్పం మీద ఆధారపడితే లోక్ సభ స్థానం గెలవడం కుదరదని భావిస్తున్నారు. దీనితో ఈ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలలో బలమైన అభ్యర్థులు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. లోక్ సభకు బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే క్రమంలో ఆర్థిక బలం కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ఖర్చు పెట్టే గల వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఎన్ ఆర్ ఐ నేత పేరును రహస్యంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల పొత్తులో భాగంగా గంగాధర నెల్లూరు అసెంబ్లీని జనసేనకు కేటాయిస్తే, డా. థామస్ కు పార్లమెంటు టిక్కెట్టు ఇచ్చే అవకాశం కూడా ఉంది. వీరితో పాటు తిరుపతికి చెందిన మాజీ IRS అధికారి హరిబాబు, వేపంజేరి మాజీ MLA డా. రవి, శాంతిపురానికి చెందిన జయప్రకాశ్, జిల్లా SC సెల్ అధ్యక్షుడు పీటర్, సినీనటుడు సప్తగిరి కూడా చిత్తూరు పార్లమెంటు టిక్కెట్టును ఆశిస్తున్నారు.
అయితే ఇప్పటికీ మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆమె గతంలో రెండు సార్లు తిరుపతి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి అక్కడ వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పోటీ పెట్టాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి పనబాక లక్ష్మిని చిత్తూరు బరిలో దింపాలని చూస్తున్నారు. అయితే ఆమె తనకు కానీ లేదా తన భర్త కృష్ణయ్యకు ఎమ్మెల్యే టికెట్టు కావాలని కోరుతున్నారని సమాచారం. అయితే చంద్రబాబు ఆదేశిస్తే చిత్తూరు లోక్ సభకు పోటీ చేసేందుకు ఆమె సిద్దంగా ఉన్నారు. అయితే ఆమె స్థానికేతరాలు అవుతుంది.
ఇదిలా ఉండగా రిటైర్డ్ ఎస్ పి పి చిన్నస్వామి టికెట్టును ఆశిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. జి డి నెల్లూరు మండలానికి చెందిన ఆయన గతంలో ఎనిమిది మంది ప్రధాన మంత్రుల వద్ద భద్రతా అధికారిగా పనిచేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆ కోటాలో టికెట్టును ఆశిస్తున్నారు. రాయలసీమలో రెండు లోక్ సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేశారు. ఇందులో ఒక లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే సత్యవేడు ఇంచార్జిగా ఆ వర్గానికి చెందిన ఉన్నారు. కాబట్టి తనకు లోక్ సభ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. అయితే మరి కొన్ని లెక్కలు తేలితే కాని చిత్తూరు లోక్ స్థానంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.