10, జనవరి 2024, బుధవారం

మునిసిపల్ కార్మికుల సమ్మె విరమణ



మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమించారు.  
రాష్ట్ర ప్రభుత్వంతో మున్సిపల్ కార్మిక సంఘ నాయకుల చర్చలు సఫలం కావడంతో తత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు తెలిపారు. 
రేపటి నుంచి తమ విధులకు హాజరుకానున్నట్లు తెలిపారు. 
అయితే పూర్తిస్థాయి సమ్మె విరమణ మాత్రం కాదన్నారు. 
ప్రభుత్వం విడుదల చేసే జీవోలను అనుసరించి తదుపరి సమ్మె విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 
తమ సమస్యల కోసం మున్సిపాలిటీ కార్మికులు గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 
ఈ విషయంలో మంత్రివర్గ ఉప సంఘం బుధవారం కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపారు. 
ఈ చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగాయి. 
పలు డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసింది. 
అయితే ప్రభుత్వ వైఖరి జీవోల తర్వాత స్పష్టంగా తెలుస్తుందని మునిసిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు గణేష్, బలరాం తెలిపారు.

మున్సిపల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మె సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో జరిగిన చర్చల సందర్భంగా అంగీకరించిన విషయాలు:-

1) ఇంజనీరింగ్ కార్మికులకు సర్టిఫికెట్ కలిగిన వారికి వారి నైపుణ్యాన్ని బట్టి వేతనాలు ఇచ్చుటకు అంగీకారం, సర్టిఫికెట్ లేని కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించుటకు అంగీకారం, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు అధ్యయనం చేయుటకు 9 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయుటకు అంగీకారం
2) ఇప్పటివరకు పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న కార్మికులందరికీ క్లీన్ ఎన్విరాన్మెంటల్ వర్కర్స్ గా గుర్తించి ఇప్పటివరకు ఇస్తున్న 15,000/- వేల వేతనము 6,000/- హెల్త్ అలవెన్స్ కలిపి మొత్తం 21,000/- వేలు వేతనాన్ని జనవరి నుండి అమలు చేసి ఫిబ్రవరి వేతనంలో వచ్చేటట్లు అంగీకరించారు.
3) అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్స్, మలేరియా వర్కర్స్, పారిశుద్ధ్య విభాగ డ్రైవర్లు, పార్కుల్లో బాత్రూం క్లిన్ చేసే వర్కర్లకు వారికి ఇస్తున్న వేతనం పైన 6,000/- ఇచ్చుటకు అంగీకరించి దాన్ని కూడా వేతనంలో కలుపుటకు అంగీకారం
4) రాష్ట్రవ్యాప్త 16 రోజుల సమ్మె కాలాన్ని పని దినాలుగా గుర్తించి వేతనం చెల్లించుటకు అంగీకారం
5) 16 రోజుల సమ్మె సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేయుటకు తగిన చర్యలు తీసుకొనుటకు అంగీకారం
6) 60 సంవత్సరాలు నిండి రిటైర్మెంట్ అయిన కార్మికులకు10 సంవత్సరాలు సర్వీసు పూర్తయిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 75,000/- ఇచ్చుటకు అంగీకారం.
7) సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగ బోనస్ గా  1,000/- రూపాయలు ఇచ్చుటకు అంగీకారం
8) ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు గతంలో ఇస్తున్న 5 లక్షల ఎక్స్గ్రేషియాను 7 లక్షలకు పెంపుదల చేస్తూ అంగీకారం.
9) కోవిడ్ -19, డైలీ వేజ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకొనుటకు ఆయా మున్సిపాలిటీలో సిబ్బందిని నియమించుకునే సందర్భంగా వీరికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని అంగీకారం
10) పారిశుద్ధ్య కార్మికులకు వేతనముతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయుటకు అంగీకారం
11) పారుశుద్ధ్యం మరియు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు మరణిస్తే దహన సంస్కారం సంబంధించి 20వేల రూపాయలను పెంచడం జరిగినది

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *