జిల్లాలో ముగ్గురు సిఐల మీద కేసు నమోదు
పుంగనూరు పోలీసుల అరాచకం మీద జాతీయ మానవ హక్కుల కమీషన్ స్పందించింది. చిత్తూరు జిల్లాలోని ముగ్గురు సిఐ లపై కేసును నమోదు చేసింది. కేసు నెంబర్ 707/IN/2024 గా కేసు రిజిస్టర్ చేసినట్లు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జోయింట్ సెక్రెటరీ కరుణాకర్ యాదవ్ తెలిపారు. చౌడేపల్లి సి ఐ కృష్ణారెడ్డి, పుంగనూరు సి ఐ రాఘవరెడ్డి, గంగవరం సి ఐ కృష్ణ మోహన్ మీద మనవ హక్కుల కమీషన్ కేసును నమోదు చేసింది.
బీసీవై పార్టీ ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గం చదళ్ళలో శనివారం "ధర్మ పోరాటసభ" నిర్వహించాలని అధినేత రామచంద్ర యాదవ్ నిర్ణయించారు. ఈ మేరకు ఈ సభకు అనుమతులు లేవంటూ శుక్రవారం పోలీసులు నిలిపివేసే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా సభ నిర్వహిస్తామని అడిగితే, అనుమతులు లేవని అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నమే రామచంద్రా యాదవ్ సభా స్థలానికి చేరుకున్నారు. ఆయన నేరుగా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తుండగా పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని అరాచకం సృష్టించారు. ప్రైవేటు స్థలంలో భారీ సంఖ్యలో పోలీసులు వెళ్లి, భయబ్రాంతులకు గురి చేశారు.. రౌడీల కంటే దారుణంగా వ్యవహరించారు.
సభా నిర్వహణకు ఆర్సీవై నేతృత్వంలో కార్యకర్తలు చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమ్యారు. ఈ క్రమంలో భారీగా చేరుకున్న పోలీసులు అక్కడ విధ్వంసం సృష్టించారు. పుంగనూరు సీఐ రాఘవరెడ్డి, చౌడేపల్లి సీఐ కృష్ణారెడ్డి సహా భారీ సంఖ్యలో పోలీసులు బీసీవై కార్యకర్తలపై దాడికి దిగుతూ, కొట్టుకుంటూ, నేలపై పడేసి ఈడ్చుకుంటూ మొత్తం మెటీరియల్ ను ద్వంశం చేశారు. పోలీసులు ఇలా చేయడంతో బీసీవై శ్రేణులు నిశ్చేష్టులై ఉండిపోయారు. అధినేత రామచంద్ర యాదవ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారం మొత్తంపై పోలీసులే బాధ్యత వహించాలని, పెద్దిరెడ్డి పాలేర్లుగా వ్యవహరిస్తున్న ప్రతీ పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.బీసీవై కార్యకర్తలను పోలీసులు చెప్పలతో కొట్టినట్లు ఆరోపిస్తున్నారు. 200 మందిని అక్రమంగా అదుపులోకి రాత్రి అంత స్టేషన్ లో ఉంది ఉదయం విడుదల చేశారు. పైగా వారి మీద కేసులను నమోదు చేశారు. ఈ విషయమై రామచంద్రయదావ్ మనవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. దితో మ్గ్గురి సి ఐ లా మీద కేసును నమోదు చేశారు.
పుంగనూరు సీఐ రాఘవరెడ్డి, చౌడేపల్లి కృష్ణారెడ్డిలు తమ స్వామి భక్తి చాటుకునేందుకు అత్యంత పాశవికంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.. మానవత్వం మరిచి, పోలీసులమే అనే ఇంగిత జ్ఞానం మరచి వీధి రౌడీల్లా వ్యవహరించారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో చెలరేగి బీసీ యువజన పార్టీ కార్యకర్తలను చెప్పులతో కొట్టారనీ, ప్రైవేటు స్థలంలోకి, పార్టీ సభా నిర్వహణ వేదిక వద్దకు వెళ్లి వందలాది మంది కార్యకర్తలను నేలపై ఈడ్చుకుంటూ, బూటు కాళ్ళతో తోస్తూ.., చేతులతో లాగుతూ.. కింద పడిపోయినా వదలకుండా చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్లారని వివరించారు. ఈ దృశ్యాలు వీడియోలను కూడా జత చేశారు. దాదాపు 200 మంది బీసీ యువజన పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఫిర్యాదు చేశారు.