9, జనవరి 2024, మంగళవారం

హస్తినకు అరణి శ్రీనివాసులు ?

 


చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి  శ్రీనివాసులు రాజ్యసభ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు త్వరలోనే అధికార పూర్వకంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి ముగ్గురు సభ్యులను రాజ్యసభకు వైసిపి అధ్యక్షుడు జగన్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో బలిజ సామాజిక వర్గం నుంచి జంగాలపల్లి శ్రీనివాసులు పేరును  ఖరారు చేసినట్లు తెలిసింది. 



చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న జంగాలపల్లి శ్రీనివాసులకు అసెంబ్లీ టిక్కెట్ విషయంలో ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానంద రెడ్డి నుంచి భారీ పోటీని ఎదుర్కొన్నారు. అధిష్టానం విజయానంద రెడ్డి వైపు ముగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో బలిజ సామాజిక వర్గం ఒక్కసారిగా వైసిపిపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా చేశారని జగన్ మీద విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికలలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారెవరు వైసిపికి పనిచేయకూడదని, ఓట్లు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నాయకులందరూ తమ పార్టీ పదవులకు రాజీనామా చేయాలని కూడా నిర్ణయించారు. వారం రోజులు వైసిపి అధిష్టానానికి గడవునిచ్చారు. వారం రోజుల లోపు బలిజ సామాజిక వర్గానికి న్యాయం చేయకుంటే తమ తడాఖా చూపిస్తామన్నారు. దీంతో బలిజ సామాజిక వర్గం మద్దతుపై అధిష్టానం పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలను బలిజలకు కేటాయిస్తోంది. అలాగే వైసీపీ కూడా ఒక స్థానాన్ని బలిజలకు కేటాయిస్తోంది. ఈ పర్యాయం బలిజలకు అసెంబ్లీ స్థానానికి బదులు రాజ్యసభను బహుమతిగా ఇచ్చినట్లు అయ్యింది.



ఆరణి శ్రీనివాసులు 15 మే 1952లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, యాదమరి మండలం జంగాలపల్లిలో జన్మించారు. ఆయన బీఏ వరకు చదువుకున్నారు. ఆరణి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘకాలం పార్టీలో పని చేశారు. యాదమరి నుండి ZPTC సభ్యుడిగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ విప్ గా పనిచేశారు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి చిత్తూరు నియోజకవర్గం నుండి పి.ఆర్.పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీకే బాబు చేతిలో 1500 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడంతో ఆయన తిరిగి టీడీపీలో చేరి తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు.


ఆరణి శ్రీనివాసులు 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినా దక్కలేదు. దీనితో ఆయన పార్టీకి రాజీనామా చేసి, 8 ఏప్రిల్ 2014న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయన 2014లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి డి‌ఏ సత్యప్రభ చేతిలో 6,799 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయన తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఏఎస్‌ మనోహర్‌ పై 39,968 ఓట్ల మెజారిటీతో గెలిచి, తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అన్ని అనుకుమ్న్నట్లు జరిగితే, జంగాలపల్లి త్వరలో పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *