4, జనవరి 2024, గురువారం

మాదిగలకు 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను కేటాయించాలి


ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు మాదిగ డిమాండ్

రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన  29 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలలో సగం సీట్లను మాదిగ సామాజిక వర్గాలకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఏపీ ఎమ్మార్పీఎస్ ) జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం మధ్యాహ్నం విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో విలేకరులతో మాట్లాడారు. 

దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి నేటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంగా మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగలకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,  నాలుగు ఎంపీ స్థానాల్లో 2 స్థానాలను మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో ఒకటి చొప్పున అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను తమ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించాలని కోరారు. 

ముఖ్యంగా ఎస్సీ రిజర్వుడు స్థానమైన  పూతలపట్టు శాసనసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మార్పీఎస్ లో  కీలకంగా పనిచేస్తున్న చిత్తూరు నగరం కోడిగుట్టకు చెందిన వెంకటేష్ కు కేటాయిస్తే తప్పక గెలిపించి తీరుతామని హామీ ఇచ్చారు. ఈనెల 20 వ తేదీన కడప నగరంలో మాదిగల భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, ఆ సభలో మాదిగల సత్తా ఏమిటో చూపుతామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పాటిస్తూ మాదిగలకు సీట్లను కేటాయించాలన్నారు. లేని పక్షంలో తగు మూల్యం చెల్లించుకోక తప్పదని వరదరాజులు హెచ్చరించారు. కాగా ఈ సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు, ఏపీ ఎమ్మార్పీఎస్ చిత్తూరు నగర ముఖ్య నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *