12, జనవరి 2024, శుక్రవారం

అంగన్వాడిలకు జీతాలు పెంచకుంటే మరో ఉద్యమం

సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, హెచ్చరిక


రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల న్యాయమైన డిమాండ్ల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తున్న నిరవధిక సమ్మె దీక్ష 32వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియూ, ఏఐటియుసి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సుజిని, షకీల, ప్రభావతి, రమాదేవి లు  మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడి వర్కర్లు లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని  డిమాండ్ చేశారు.

అంగన్వాడి వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ,సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాటివిటీ,ఉచిత భీమా సౌకర్యం కల్పించాలని , మినీ అంగన్వాడి సెంటర్లను మెయిన్  సెంటర్ గా గుర్తించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపజేయాలని మనవి చేశారు. ఈ సమస్యల పరిష్కారాo కోరుతూ గత 32 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అంగన్వాడి కార్మికుల పట్ల మొండి వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపకపోగా తన దుర్మార్గపు ఆలోచనతో అంగన్వాడి వర్కర్ల ఉద్యమాన్ని  నిర్వీర్యం చేయడానికి  ఎస్మ్మా చట్టం జీవో నెంబర్ 2 ను విడుదల చేశరన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించడాన్ని , అధికార పార్టీలకు సంబంధించిన నాయకులు చేత, పోలీసులు చేత అంగన్వాడి కార్యకర్తలను బెదిరించడాన్ని, భయభ్రాంతులు చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. లేనిపక్షంలో మరొక ఉద్యమం రుచి చూడవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులకు అంగన్వాడి కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు. 

ఏఐటీయూసీ జిల్లా గౌరాధ్యక్షుడు యస్ నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి కాంజివరం  సురేంద్రన్ లు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా  32 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోగా  వారిని రోడ్డున పడవేయడం ఎంతవరకు సమంజసమా సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోనే పెద్ద పండగ అయినా సంక్రాంతి పండుగ పూట అంగన్వాడీ కార్యకర్తలకు వారి కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వన్ని తీవ్రంగా దుయ్య బెట్టారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి, అంగన్వాడి రాష్ట్ర సంఘాల నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి  అంగన్వాడీ కార్యకర్తల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్ష శిబిరం లో అంగన్వాడి వర్కర్లు, మినీ అంగ్వాడీ వర్కర్లు హెల్పర్ లు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *