అంగన్వాడీల 24 గంటల రిలే దీక్షలు ప్రారంభం
అంగన్వాడీ సమ్మెపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గం
దీక్షలను ప్రారంభించిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్ వి నరసింహారావు
రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం 26 రోజులు సమ్మె చేస్తుంటే దిగిరాకపోవడంతో 24 గంటల రిలే దీక్షలు శనివారం నుండి చిత్తూరు కలెక్టరేట్ వద్ద ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలకు ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు అధ్యక్షత వహించారు. దీక్షలను పూలమాలవేసి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్ వి నరసింహారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్ వి నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడో లేనివిధంగా అంగన్వాడీల ఉద్యమంపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమన్నారు. ఆగ మేఘాల మీద జీవో నెంబర్ 2 తీసుకువచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయోగిస్తుండడం దుర్మార్గమన్నారు. ఇలాంటి బెదిరింపులకు అంగన్వాడి ఉద్యమం చాలా చూసిందని ఎస్మా లాంటివి ఎన్ని చట్టాలు తెచ్చిన ఉద్యమ ఆగదని సమస్యలు పరిష్కారం చేస్తేనే ఉద్యమం ఆగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రయోగాలు చేయడం మానేసి సమస్యలను పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడి వాళ్లతో పాటు మున్సిపాలిటీ ,ఎస్ఎస్ఏ కార్మికులందరూ సమ్మె బాట పట్టారు.ఎన్నికలు దగ్గర్లో ఉన్న బెదిరింపులు పాల్పడుతున్నది. ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే పనులు అంగన్వాడీలు ఉంటారని హెచ్చరించారు. జిల్లా గౌరవాధ్యక్షుడు నాగరాజు, సిఐటియు అంగన్వాడీల జిల్లా కార్యదర్శి షకీల, ఏఐటియుసి అంగన్వాడిని నాయకురాలు ప్రభావతి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, నాయకులు రమాదేవి,చంద్ర, గోపినాథ్, మణి తదితరుల పాటు చిత్తూరు ప్రాజెక్ట్ నాయకులు పాల్గొన్నారు.
అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను వెంటనే ఉపసంహరించుకోవాలి
అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ జీవో నెంబర్ 2 తీసుకురావడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 రోజులు శాంతియుతంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను చట్ట పరిధిలోకి తీసుకురావడం సమ్మెను నిషేధించడం అప్రజా స్వామ్యమని ద్వజమెత్తారు. సమస్యలను పరిష్కారం చేయకుండా సమ్మె చేయకుండా నిషేధించడం వేతనాల్లో కోత విధిస్తామని చెప్పడం అన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను అక్రమ మార్గంలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం అభ్యంతరకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచిడానికి ప్రయోగం చేస్తున్నదని రాష్ట్ర కార్మిక వర్గం దాన్ని త్రిప్పి కొడుతుందని హెచ్చరించారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని హెచ్చరించారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించి, కలిసి రావాలని పిలుపునిచ్చారు. అంగన్వాడి పోరాటానికి వాళ్ల సమస్య పరిష్కారమయేంతవరకు ప్రత్యక్షంగా సిపిఎం మద్దతు తెలియజేస్తుందని పిలుపునిచ్చారు.