ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై పోలీసు కేసు
గంగాధర నెల్లూరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై మీద హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదు అయినట్టు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి సీఎం నారాయణస్వామి మీద తెలంగాణ సీనియర్ నేత మల్లురవి బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, తెదేపా అధినేత చంద్రబాబు కారణమని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మల్లు పోలీసులను కోరారు. సోనియాగాంధీపై అసత్య ఆరోపణలు చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై కేసు నమోదు చేయాలని మల్లు రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర రాజకీయాలలోకి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తున్న ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరణం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ మరణానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, చంద్రబాబు కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డి మీద విచారణ జరగాలన్నారు. తమ అధినేత సోనియా మీద నారాయణ స్వామి చేసినా వ్యాఖ్యలపై మల్లు ఫిర్యాదు చేశారు, ఇక ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ఆర్ కు సోనియాగాంధీ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారని గుర్తు చేశారు.
వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక విమానాలను పంపించి మరీ జాడ కోసం వెతికించారని తెలిపారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారని వివరించారు. ఈ విషయాన్ని నారాయణస్వామి గ్రహించి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామిని హెచ్చరించారు. అవాస్తవాలు మాట్లాడిన నారాయణస్వామిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.