దళితులకు ద్రోహం చేసిన ఎం ఎస్ బాబు
పూతలపట్టు నియోజకవర్గం MLA MS వైఖరిని తవణంపల్లి మండల దళిత నాయకులు తీవ్రంగా ఖండించారు. తవణంపల్లి వైయస్సార్ పార్టీ కార్యాలయంలో గురువారం దళిత సంఘ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. పూతలపట్టు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పటినుండి మండలంలోని దళిత నాయకులు నీవెంట ఉండి అత్యధిక మెజారిటీతో గెలిపించామని తెలిపారు.
మండలంలోని దళితులకు న్యాయం చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా దళితుల్లో వర్గాలు ఏర్పరిచి దళితులను మోసం చేశారని విమర్శించారు. మిమ్మల్ని నమ్ముకున్న మాకు ద్రోహం చేసి పార్టీని దిక్కరించడం న్యాయమా అని నిలతీశారు. ఇకనైనా అధిష్టానం మేరకు నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి పార్టీలో కొనసాగితే మీకు గౌరవం దక్కుతుందని తెలిపారు. మీరు చేసిన విమర్శలను ఆత్మ విమర్శన చేసుకోవాలని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ గౌరవ అధ్యక్షులు మురుగన్, అధ్యక్షులు జగన్నాథం, ఉపాధ్యక్షులు చిన్నయ్య, ఎంపీటీసీ డేవిడ్, ఎంపీటీసీ ఇంద్రాణి గంగయ్య, కార్యదర్శి చిట్టిబాబు, సంయుక్త కార్యదర్శి అనంత్ కుమార్, మణిరాజ్, లీగల్ అడ్వైజర్ మధు కుమార్, మెంబర్లు వెంకటేష్, గురునాథం, జగదీష్ , రవి, ఇన్బనాదం, ఉపేంద్ర, అజిత్, దళిత నాయకులు పాల్గొన్నారు..