మొదలియార్లను ఓబీసీ జాబితాలో చేర్చాలి
కేంద్ర ప్రభుత్వంలో నీ ఓబీసీ జాబితాలో మొదలియార్లను చేర్పించాలని రాష్ట్ర మొదిలియార్ కార్పొరేషన్ అధ్యక్షులు బుల్లెట్ సురేష్ కోరారు. అలాగే చిత్తూరు గంగినేని చెరువు వద్ద మరుదు సోదరుల విగ్రహా ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని, మొదలియార్ల సంక్షేమానికి కమ్యూనిటీ హాల్ భవనo ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చిత్తూరు నగరంలోని కలై బాల కళ్యాణ మండపంలో ఆదివారం మొదిలియార్ కులస్థుల ఆత్మీయ సమావేశం రాష్ట్ర మొదిలియార్ కార్పొరేషన్ అధ్యక్షులు బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్నికి ముందుగా మరుదు పాండియర్ సోదరుల చిత్రపటానికి పూలమలవేసి నివాళ్లు అర్పించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర మోదిలియర్ కార్పొరేషన్ అధ్యక్షులు బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ గతంలో వెనుకబడిన మోదిలియార్ లను బిసిలుగా గుర్తించాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో మొదిలియార్ లను 3జిల్లాలో మాత్రమే బీసీలుగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొదిలియార్ కులస్తులందరినీ బీసీలో చేరుస్తూ జీవోను విడుదల చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మొదలియార్ కులస్తులు, చిత్తూరు శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, బుల్లెట్ సురేష్ పాలాబిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
⁍ కేంద్ర ప్రభుత్వంలోని ఓబీసీ జాబితాలో మొదలియార్లను చేర్పించాలని సమావేశంలో తీర్మానించారు.
⁍ చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద మరుదు సోదరుల విగ్రహా ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని కోరారు.
⁍ మొదలియార్ల సంక్షేమానికి కమ్యూనిటీ హాల్ భవనo ఏర్పాటుకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు అన్ని విధాల న్యాయం చేయాలంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని, మొదలియార్ కులస్తుల డిమాండ్లను పూర్తి చెసెందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళుతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు మొదలియార్ సంఘం నాయకులు రాజశేఖర్ మొదలియార్, ఏజీ బాలాజీ, సుందరం మొదలియార్, కార్పొరేటర్లు నవీన్, జ్ఞాన జగదీష్, చిత్తూరు టౌన్ బ్యాంకు చైర్మన్ రాంగణేష్, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్లు శేఖర్, కల్పన, సుగుణమ్మ, యువనాయకులు బుల్లెట్ అప్పు, ఫైనాన్స్ శివ, జి కృష్ణమూర్తి, స్టోర్ శివ, ఉదయ,గణేష్,సంతోష్,జగన్, ఆర్కాట్ శ్రీనివాస మొదలియార్, చక్రధర్ పాల్గొన్నారు.