22, నవంబర్ 2023, బుధవారం

చంద్రబాబు CM కావాలంటే, ఎవరు త్యాగం చేయాలి?

 


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిగానీ, అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశారు. ఈ సారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుంటే, భవిషత్తులో ఆ పార్టీ ఉండదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మళ్ళి జగన్ ముఖ్యమంత్రి అయితే, తెదేపా నాయకులు పొలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాచిందే. చాలా మంది జైళ్ళ పాలవుతారు. పార్టీలో నాయకులు ఎవరూ మిగలరు. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురు కావాల్చిందే. పార్టీని కాపాడుకోవడానికి, చంద్రబాబు మళ్ళి ముఖ్యమంత్రి కావడానికి ప్రతి జిల్లాలో మెజారిటీ సీట్లును గెలువడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొహమాటానికి పోకుండా, గెలుపు గుర్రాలను గుర్తించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఇందుకు కులాల సమీకరణాలు చాలా ముఖ్యం. చిత్తూరు జిల్లాలో ఇప్పదికిప్పుడు ఎన్నికలు జరిగితే, నాలుగు సీట్లు మాత్రమే తెదేపా గెలుచుకుంటుందని ఒక సీనియర్ నాయకుడు విశ్లేషించారు. దీనిని బట్టి జిల్లాలో పార్టీ ఎంత బలహీనంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఆ నాయకుని విశ్లేషణ ప్రకారం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం త్యాగం చేయక తప్పదని అన్నారు. బలమైన రెడ్డి సామాజిక వర్గం నేతలను బరిలో దించక తప్పదని అభిప్రాయపడ్డారు. మైనారిటి, BC అభ్యర్థులకు ఒక్కొక్క స్థానం కేటాయించాలని పేర్కొన్నారు. వీటి మీద జిల్లా వ్యాప్తంగా విహంగ విక్షణమే ఈ వ్యాసం. రేపటి నుండి నియోజకవర్గాల వారిగా విశ్లేషణలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు తన స్వంత జిల్లాలో ఎక్కువ స్థానాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత జరిగిన మూడు ఎన్నికల్లో సాధించిన విజయాల ఆధారంగా కుల సమీకరణాలు చేయాలని నిర్ణయించుకున్నారు. గెలుపే ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తున్నారు. గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నారు. పార్టీకి సేవ చేసిన వారైనా గెలుపు అవకాశాలు లేకుంటే పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలాంటి వారికే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఆమేరకు సర్వేలు చేయించి నివేదికలు తెచ్చుకున్నారు. 


జిల్లాలో ఉన్న 14 నియోజక వర్గాలలో పూతలపట్టు, జి డి నెల్లూరు, సత్యవేడు  సామాజిక వర్గాలకు రిజర్వు చేశారు. మిగిలిన 11 నియోజక వర్గాలలో కులాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయాలని  భావిస్తున్నారు. జిల్లాలో కుప్పం తప్ప ఒక ఇయోజక వర్గం కూడా కమ్మ సామాజిక వర్గం వారికి అనుకూలంగా లేదని గుర్తించారు. 2009 నుంచి పరిశీలిస్తే కుప్పంలో చంద్రబాబు మాత్రమే మూడు సార్లు గెలిచారు. నగరిలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు 2009లో 1308 ఓట్ల స్వల్ప  తేడాతో గెలిచారు. తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆయన, ఆయన కుమారుడు భాను ప్రకాష్ పోటీ చేసి ఓడి పోయారు. 


అదే సంవత్సరం గల్లా అరుణ కుమారి చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 10,980 గెలిచారు. ఆమె 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి 4,518 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పులివర్తి నాని 41,755 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు.మిగిలిన ఒక నియోజక వర్గంలో కూడా తమ సామాజిక వర్గం వారు గెలవలేదు అన్న చేదు నిజాన్ని స్వీకరించాక తప్పలేదు. మొత్తం నియోజక వర్గాలను పరిశీలిస్తే చిత్తూరులో రెండు సార్లు బలిజ, ఒకసారి రెడ్డి గెలిచారు. పలమనేరులో  రెండు సార్లు రెడ్లు, ఒక సారి బిసి విజేతగా నిలిచారు. పుంగనూరు, పీలేరు, శ్రీకాళహస్తి నియోజక వర్గాలలో మూడు సార్లు రెడ్డి సామాజిక వర్గీయులు విజయం సాధించారు. చంద్రగిరి, నగరిలో ఒక సారి కమ్మ, రెండు సార్లు రెడ్డి అభ్యర్థులు గెలిచారు. తంబళ్లపల్లెలో ఒక సారి బిసి, రెండు సార్లు రెడ్లు గెలిచారు. తిరుపతిలో రెండు సార్లు బలిజ ఒక సారి రెడ్డి గెలిచారు. మదనపల్లెలో  ఒక సారి రెడ్డి, రెండు సార్లు మైనారిటీలు విజయం సాధించారు.


ఇక కుప్పంలో మూడు సార్లు చంద్రబాబు గెలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కుప్పం తప్ప మిగిలిన నియోజక వర్గాలలో కమ్మ సామాజిక వర్గం నేతలు త్యాగం చేయక తప్పని పరిస్థితులు రావచ్చు. గెలుపు సాధించాలంటే  చిత్తూరు, తిరుపతి నియోజక వర్గాలలో బలిజ సామాజిక వర్గం వారికి అవకాశం కల్పించక తప్పదు. మదనపల్లిలో  ముస్లిం అభ్యర్థికి టిక్కెట్టు ఇస్తే మంచిది అంటున్నారు. కుప్పం ఎలాగూ చంద్రబాబు పోటీ చేస్తారు. మిగిలిన ఏడు నియోజక వర్గాలలో కనీసం ఆరు చోట్ల రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే తంబళ్లపల్లె, పుంగనూరు, నగరిలో ఒక స్థానం అయినా బిసి అభ్యర్థికి కేటాయించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్కెట్టు కోల్పోయే కమ్మ సామాజిక వర్గం నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *