గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయండి
జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పంచాయతీ రాజ్ శాఖ కీలకమని జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశపు మందిరం వై ఎస్ ఆర్ సభా వేదిక లో జిల్లాలోని విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు ఒకరోజుఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెడ్పి సీఈవో మాట్లాడుతూ గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను సులభతరం చేయడం జరిగిందని, ప్రజల ఇంటి ముంగిటి కే ప్రభుత్వ సేవలు అందు తున్నాయన్నారు. ఈ సచివాలయ వ్యవస్థలోపంచాయతీ కార్యదర్శులు పాత్ర అధికంగా కలదన్నారు.గ్రామ పంచాయితీ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పని చేయాలన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ కేటాయించిన విధులను క్షేత్రస్థాయి లో సమర్థవంతంగా నిర్వహించాలని,మండల స్థాయి లో కూడా శిక్షణ కార్య క్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.
క్షేత్రస్థాయి సిబ్బంది తో గ్రామపంచాయతీ లలో సమావేశాలు నిర్వహించుట,ఆదాయ మార్గాలు ఏర్పాటు చేసు కొనుట గ్రామ పంచాయతీ లో చేయవలసిన పనులు, నిర్వహించాల్సిన రికార్డులు, గ్రామపంచాయతీలో తనిఖీలు, సర్పంచులు మరియు పంచాయతీ కార్య దర్శుల విధులు బాధ్యతలు తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమంలో వివరించారు.
ఈ శిక్షణ కార్యక్రమం లో డి పి ఆర్ సి కో ఆర్డినేటర్ షణ్ముగం, డిఎల్ పి ఓ లు నగరి, పలమనేరు, కుప్పం మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.