11, నవంబర్ 2023, శనివారం

చిత్తూరు టిడిపి అభ్యర్థిగా సిఆర్ రాజన్?

 


చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన తిరుచానూరు మాజీ సర్పంచ్ సిఆర్ రాజన్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా నాయకులు అధిష్టానానికి ప్రతిపాదన చేసినట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో కూడా ఎందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పుడున్న తాజా రాజకీయ పరిస్థితి ప్రకారం చిత్తూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా డాక్టర్ సిఆర్ రాజన్ బరిలో నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆయనకు జిల్లాకు చెందిన కొందరు నాయకులు కూడా  మద్దుతు ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అండదండలు కూడా ఉన్నాయి.



ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్నె కుల క్షత్రియ సామాజిక వర్గం ఒక బలమైన సామాజిక వర్గం. ఈ కులానికి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల పైగా ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఎక్కువగా కుప్పం, శ్రీకాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, నగిరి నియోజకవర్గాలలో వీరి ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పం, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ఈ సామాజిక వర్గం నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి కాదు. శ్రీకాళహస్తి నియోజకవర్గ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముని రామయ్య గతంలో పోటీ చేసి గెలుపొందారు. అయిన ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. శ్రీకాళహస్తి MLA టిక్కెట్టును ఆశిస్తున్నారు.



వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పెద్దపీట వేసింది. కుప్పం నియోజకవర్గానికి చెందిన భరత్ ను, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన సిపాయి సుబ్రహ్మణ్యంలను ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. కుప్పం ఇన్చార్జిగా ఎమ్మెల్సీ భరత్ ను నియమించింది. రానున్న ఎన్నికల్లో కుప్పం నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భరత్ పోటీ చేయనున్నారు. అలాగే ఆయన జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఉండిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో చేర్చుకొని వెంటనే ఎమ్మెల్సీగా అందలం మెక్కించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి జిల్లాలో పెద్దపీట వేయడంతో తెలుగుదేశం పార్టీ కూడా తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.




తిరుచానూరుకు  చెందిన మాజీ సర్పంచ్ డాక్టర్ సిఆర్ రాజన్ రెండు నెలల కిందట చంద్రబాబు నాయుడును కలిసి తన అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చిత్తూరుకు చెందిన న్యాయవాది త్రిమూర్తి కూడా చేరారు. ఈ సందర్భంగా జిల్లాలో వన్నె కుల క్షత్రియ వర్గానికి ఒక స్థానాన్ని జిల్లాలో  కేటాయించాలని ప్రతిపాదన వచ్చింది. అందుకు చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. చిత్తూరు  నియోజకవర్గానికి ఇప్పటి వరకు కూడా లేరు. ఇన్చార్జిని నియమించడానికి పార్టీ మినమేషాలను లెక్కిస్తోంది. చిత్తూరు నుంచి ఎమ్మెల్యే రేసులో బలిజ సామాజిక వర్గానికి చెందిన కాజూరు బాలాజీ, కటారి హేమలతలు ఉన్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్ర ప్రకాష్, గురుజాల జగన్మోహన్రెడ్డి, NP జయప్రకాశ్ రేసులో ఉన్నారు.



అయితే ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఎవరూ లేకపోవడంతో  తొందరలోనే నియోజకవర్గ ఇన్చార్జిగా సిఆర్ రాజన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. రానున్న ఎన్నికలలో  తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దించుతుందని దేశం పార్టీలో ప్రచారం జరుగుతోంది. సి.ఆర్ రాజన్నకు చిత్తూరు జిల్లాకు చెందిన  కొందరు నాయకులతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా సీఆర్ రాజన్ అభ్యర్థిత్వానికి  మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *