3, నవంబర్ 2023, శుక్రవారం

రోజా రిసార్టుకు రాకూడదా? చిట్టిబాబు



మంత్రి రోజా పాలసముద్రంలో ఉన్న తన రేవా రిసార్టులో బస చేస్తే తప్పేమిటని గంగాధర నెల్లూరు నియోజకవర్గ  టిడిపి మాజీ ఇంచార్జి నేత భీమినేని చిట్టిబాబు ఒక జిల్లా స్థాయి నేతకు ఎదురు ప్రశ్న వేశారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగింది పొరబాటు అని ఒప్పుకోక పోగా, హెరిటేజ్  పాలు తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే అమ్ముతారా? అంటూ ఎదురు ప్రశ్న వేసినట్లు సమాచారం. దీంతో ఆ నాయకుడు చిట్టిబాబు మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భవిష్యత్తులో చిట్టిబాబు మీద పార్టీ పరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది.



బుధవారం  రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు వై వి రాజేశ్వరి బుధవారం జి డి నెల్లూరు అన్న క్యాంటీన్లో తన భర్త రామకృష్ణ నాయుడు వర్ధంతి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు, జి డి నెల్లూరు నియోజక వర్గాలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కీలక నాయకుడు ఒకరు చిట్టిబాబును పిలిచి మంత్రి రోజా కుటుంబానికి రిసార్టు ఎందుకు ఇచ్చావని ప్రశ్నించి నట్టు తెలిసింది. దానికి ఆయన నిర్లక్యంగా మాట్లాడుతూ అది  తన వ్యాపారమని  సమాధానం చెప్పారని సమాచారం. పైగా హెరిటేజ్ పాలు టిడిపి వారే తాగుతారా, వైకాపా వారికి అమ్మారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారని తెలిసింది. దీంతో ఆ నాయకుడు చిట్టిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. రోజా రోజు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శిస్తున్నారని, అలాంటి ఆమెకు రిసార్టు ఇవ్వడం తప్పని తీవ్ర స్వరంతో అన్నట్లు తెలిసింది. అయిన రహస్యంగా రావలసిన అవసరం ఏముందని నిలతీసినట్లు తెలిసింది. చిట్టిబాబుపై అధిష్టానానికి కట్టలు, కట్టలు ఫిర్యాదులు వెళ్ళయని, ఈ సారి జిల్లా నాయకులు ఎవరు మద్దతు ఇవ్వరని హెచ్చరించారని తెలిసింది.   


వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, జి డి నెల్లూరు ఇంచార్జి డాక్టర్ థామస్, జి డి నెల్లూరు మండల కమిటీ అధ్యక్షుడు స్వామిదాస్, ఎస్ ఆర్ పురం మండలం కమిటీ అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, పెనుమూరు మాజీ ఎంపిపి హరిబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *