8, నవంబర్ 2023, బుధవారం

జిల్లాలో విద్యా సంస్థల బంద్ విజయవంతం

 


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని  పామాపక్షా విద్యార్థి సంఘాల  AISF, TNSF, BSU చేపట్టిన బంద్ జిల్లాలో  విజయవంతం అయ్యింది. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆదేశాల మేరకు రాష్ట్ర బందుకు తెలుగు నాడు విద్యార్థి  సమాఖ్య మద్దతుతో  మరియు జనసేనకు అనుబంధ సంస్థ అయిన భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ మద్దతు తెలియజేశారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ హక్కు ఈరోజు ప్రవేట్లైజేషన్ ఆపాలని ఆందోళన చేస్తున్న కార్మికులు నిరుద్యోగులుఉద్యమం నేటితో 1000 రోజులు అయిన సందర్భంగా జిల్లాలోని విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల సుమారు 50 వేల నుంచి రెండు లక్షల మంది దాకా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందనీ, దీన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తే  సుమారు రాష్ట్రంలోని ఐదు కోట్ల మందినష్టపోతారని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు.



తెలుగునాడు విద్యార్థి సమాఖ్య చిత్తూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభు తేజ,  ఉపాధ్యక్షుడు గూగుల్ ఆదిత్య, నగర అధ్యక్షుడు జగన్, గుడిపాల మండల అధ్యక్షుడు శ్యాం ప్రసాద్, నాయకులు రాజ్ కుమార్ , గిరీష్ , నాగరాజ్ , ఎల్లప్ప, పవన్, ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్ ప్రవీణ్ కుమార్, భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు చైతన్య, తరుణ్, వినయ్, కుల్దీప్, ముని, దుర్గ పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *