17, నవంబర్ 2023, శుక్రవారం

సలసల కాగే నూనెలో చేతులు పెట్టి... శీల పరీక్ష

 పూతలపట్టు మండలంలో దారుణం 

సకాలంలో రక్షించిన MPDO గౌరి


ఆధునిక సంకేతిక యుగంలో కూడా అక్కడ పురాతన మూడాచారాలు ఇంకా రాజ్యం లేలుతున్నాయి. అనాగరిక శీల పరీక్షలు మళ్ళి పుట్టుకువస్తున్నాయి. అగ్నిప్రవేశం లాంటి ఆచారాలు కనిపిస్తున్నాయి. ఇదెక్కడో మారుమూల కుగ్రామంలో కాదు. ఆటవిలో అంతకన్నా కాదు. జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న ఒక గ్రామంలో ఈ మూడాచారం మళ్ళి పుట్టుకురావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంకా అక్కడ అక్కడ మూఢ నమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మూఢ నమ్మకాలను ఇంకా పట్టుకొని వేలాడుతూనే ఉన్నారు. సమాజమంతా సాంకేతిక రంగంలో దూసుకెళ్తుంటే.. కొంత మంది మాత్రం వాటిని వదలడం లేదు. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త వేడి నూనెలో పెట్టి తన ప్రాతివత్యాన్ని నిరూపించుకోవాలని ఆదేశించాడు. ఇందుకు అమాయక భార్య కూడా అంగీకరించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో  చోటు చేసుకుంది. సకాలంలో సమాచారం అందుకున్న MPDO గౌరి వెళ్లి భాదితురాలిని రక్షించారు.


చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని తేనెపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్టీ కాలనీలో గుండయ్య, గంగమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో గుండయ్యకు భార్య గంగమ్మపై కొంతకాలంగా అనుమానం వస్తుంది. తన భార్యకు ఎవరితోనో వివాహేతర సంబంధం కలిగి ఉందని అనుమానం. దీంతో శీల పరీక్షకు పెట్టాలనుకున్నాడు. కుల పెద్దలతో పంచాయితీ పెట్టాడు. తన అనుమానాన్ని తెలియచేశాడు. భార్య శీలం మీద తనకు నమ్మకం లేదన్నాడు. శీల పరీక్ష జరగాలని పట్టుపట్టాడు. పెద్దలు ఎంత నచ్చచెప్పినా, వినలేదు. 


తమ కులంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం  ప్రాతివత్యాన్ని నిరూపించుకోవడానికి వేడి నూనెలో చేతులు పెట్టాలని కోరాడు. భార్య కూడా తాను ఏ తప్పూ చేయలేదని కాళ్ళ వెళ్ళా పడింది. చివరకు చేయునది లేక వేడి నూనెలో చేతులు పెట్టి తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవడానికి సిద్దం అయ్యింది. వేడి నూనెలో చేతులు పెట్టేందుకు సిద్ధమైంది. అనుకున్నదే తడవుగా నూనె తెప్పించారు. కడాయి పెట్టి నునెను వేడి చేయడం ప్రారంభించారు. ఈ సమాచారం అందుకున్న పూతలపట్టు ఎంపీడీవో గౌరి హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చి మూఢాచారాన్ని అడ్డుకున్నారు.  ఆ మూఢాచారాన్ని అడ్డుకున్నారు. ఇలా చేయడం తప్పని గ్రామస్తులకు నచ్చ చెప్పారు. గుండయ్యను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *