5, నవంబర్ 2023, ఆదివారం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలి


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, రైతు వెతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని AITUC -CITU రాష్ట్ర నాయకుల పిలుపు ఇచ్చారు.  ఎఐటియుసి, సిఐటియు  ఆధ్వర్యంలో చిత్తూరు యస్ టి యూ కార్యాలయంలో ఏ ఐ టి యూ సి జిల్లా కార్యదర్శి టి.కోదoడ అధ్యక్షతన సదస్సు జరిగింది.

 సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక , రైతు వ్యతిరేక విధానాలను ఎండ కట్టారు. దేశంలో రాష్ట్రంలో రైతులు కార్మికులు ఇబ్బందులకు గురి అవుతున్న పట్టించుకోకపోవడం దుర్మార్గం ,దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వరంగ సంస్థలను ఆదాని, అంబానీలకు కట్టబెట్టి దేశాన్ని ,దేశ ప్రజలను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదన్నారు. 

దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం సమన్వయంగా ఐక్య పోరాటాలు చేస్తూ బిజెపి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు పోరాటం కొనసాగించాలని కార్మిక వర్గానికి రైతందానికి ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. విశాఖ ఉ క్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి బిజెపి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే  సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కార్మిక వర్గం ఎండగట్టాలన్నారు .దేశం ప్రజలు బాగుండాలన్న రాష్ట్ర ప్రజలు బాగుండాలన్న అభివృద్ధి జరగాలన్న బిజెపి మోడీ ప్రభుత్వాలను తరిమికొట్టాలని కార్మిక వర్గానికి రైతాంగానికి పిలుపునిచ్చారు. నవంబర్ 27, 28 విజయవాడలో జరిగే కార్మిక రైతు మహాధర్నాను జయప్రదం చేయాలని  పిలుపునిచ్చారు. 


ఈ  సదస్సులో  ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ .నాగరాజు, సిఐటియు నాయకులుపి. చైతన్య, సురేంద్ర, సత్యమూర్తి,  ఓబుల రాజు, గోపీనాథ్,  మణి,నాగరాజ్ ,విజయ గౌరీ, జయలక్ష్మి,  ఏఐటియుసి  సిఐటియు,  రైతు, మహిళా సంఘ నాయకులు సంఘం నాయకులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *