17, నవంబర్ 2023, శుక్రవారం

చిత్తూరు చేరిన అయోధ్య రామయ్య అక్షితలు

 చిత్తూరులో ఘనంగా స్వాగతం 

మేళతాలాలతో నగరంలో  ఊరేగింపు 

రామాలయం చేరిన అక్షితలు 


అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న శ్రీరాముని దివ్య భవ్య మందిర ప్రారంభోత్సవం జనవరి 22 , 2024 న జరగనున్న  నేపధ్యంలో ఈ వేడుకను పురస్కరించుకొని దేశములోని ప్రతి హిందూ కుటుంబానికి  అయోధ్యలోని బాల రాముని పూజలో ఉపయోగించిన అక్షింతలు, రామాలయ చిత్రపటము చేర్చాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా అయోధ్య నుండి చిత్తూరుకు శుక్రవారం ఉదయం అక్షింతలు శ్రీరామ సేవకుల ద్వారా చేరింది. రైల్వే స్టేషన్ నుండి నగరంలోని పురవీధుల గుండా శ్రీరామ ఆలయం వరకు జరిగిన జనజాగరణ ఊరేగింపులో విశ్వహిందూ పరిషత్తు, బజరంగ్దళ్ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ, భారతీయ జనతా పార్టీ, సమరసత ఫౌండేషన్ ,వివిధ క్షేత్ర కార్యకర్తలు, వివిధ హిందూ ధార్మిక సంస్థలు అందరం పాల్గొన్నారు.


ఈ అక్షంతలను మేళ తాళాలతో, కోలాటాలతో, జై శ్రీరామ్ నినాదాల నడుమ చిత్తూరు రైల్వే స్టేషన్ నుండి ఊరేగింపుగా హైరోడ్ మీదుగా హాస్పిటల్ రోడ్ మీదుగా మార్కెట్ చౌక్, బజారు వీధి మీదుగా  శ్రీ కోదండ రామస్వామి దేవస్థానము చేర్చి పూజాదికాలు నిర్వహించి భద్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రామ సేవకులు విహెచ్పి హరిబాబు, వేలు ,బిజెపిచిట్టిబాబు, రామభద్ర, తోట పాలెం వెంకటేష్, జయ చంద్ర, జయకుమార్, రామమూర్తి, కొత్తూరు బాబు, పాండియన్, రంగారావు, హరికృష్ణ, బాలాజీ, గోపాల్, చైతన్య, చైత్రేష్, లోకనాథం, ఆలయ పూజారి అనేకమంది మహిళలు, భక్తాగ్రేసర్లు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *