హల్లో కిడ్స్ లో ఘనంగా హల్లో వీన్స్ సంబరాలు
ప్రపంచం లోని అన్ని దేశాలలో వినోదాత్మకంగా జరుపుకొనే దెయ్యాల పండుగనే హల్లో వీన్ ఫెస్టివల్ అంటారు. బ్రతికి ఉన్నవారికి, మరణించిన వారికి మధ్య ఉన్న అడ్డంకులు ఈ పండుగ రోజు తొలగి పోతాయని వారి నమ్మకం. ఈ హల్లో వీన్స్ పండుగను స్థానిక గురునగర్ కాలనీ లోని ప్రముఖ విద్యా సంస్థ హల్లో కిడ్స్ లో శుక్రవారం అత్యంత ఘనంగా జరిగింది. ఈ మేరకు హల్లో కిడ్స్ కరస్పాండెంట్ డాక్టర్ బి ఎల్ వి లోహిత్ కుమార్, డైరెక్టర్ పవిత్ర లోహిత్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ పండుగ రోజు వివిధ రకాలైన వేషధారణతో, దెయ్యాలు, భూతాలు లాగా వేషం ధరించి వినోదాత్మకంగా అందరూ కలిసి నృత్యాలు చేయడం, పాటలు పాడటం చేస్తూ ఉంటారు. ఆ విధంగానే హల్లో కిడ్స్ విద్యార్థినీ విద్యార్థులు అందరూ ప్రసంసించే విధంగా అద్భుతమైన వేష దరణతోదెయ్యలు, భూతాలు, మంత్రగత్తెలు మరి కొన్ని హార్రర్ సినిమాలో ఉండే విధంగా వేష ధారణతో వచ్చి ఆ పాత్రలను అనుకరిస్తూ పాటలు, నృత్యాలతో చూపరులను విశేషంగా అలరించింది.
ట్రిక్ ఆర్ ట్రీట్ ఆటలతో భగా సందడి చేయడం జరిగింది. స్నేహితులతో కలిసి గుమ్మడి కాయ పానీయం తాగుతూ సరదాగా గంతులు వేయడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలియజేశారు. ఈ కార్య క్రమంలో తల్లితండ్రులకు, చిన్నారులకు, వారి సన్నిహితులకు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.