రెడ్ల పట్టుకొమ్మ శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి
2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి బియ్యం మధుసూదన రెడ్డి టిడిపి అభ్యర్థి గోపాల కృష్ణా రెడ్డి పై 38,141ఓట్ల మెజారిటీ సాధించారు. అప్పటి నుంచి గోపాల కృష్ణా రెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి టిడిపి నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్నారు. ఆయనకు నారా లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టిడిపి ఏర్పడిన తరువాత 10 సార్లు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది సార్లు రెడ్డి సామాజిక వర్గం వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కమ్మ, వన్నె కుల క్షత్రియ సామాజిక వర్గం వారు ఒక్కొక్క సారి గెలిచారు. కాబట్టి రెడ్డి వర్గానికి పట్టు వున్న ఇక్కడ తిరిగి సుధీర్ రెడ్డికి టిక్కెట్టు వస్తుందని ఒక వర్గం అంటున్నారు. అయితే సుధీర్ రెడ్డి కంటే మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడుకు టిక్కెట్టు ఇస్తే మంచిదని ఒక వర్గం పట్టు పడుతున్నారు.
రాజకీయ చైతన్యం కల శ్రీకాళహస్తి నియోజక వర్గం టిడిపి టిక్కెట్టు కోసం గట్టి పోటీ నెలకొన్నది. 1956 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నీలం సంజీవ రెడ్డి తమ స్వంత నియోజక వర్గంలో ఓడి పోయినప్పటికీ ముఖ్యమంత్రి అయ్యారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అద్దూరు బలరామ రెడ్డి రాజీనామా చేసి సంజీవ రెడ్డికి అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న శ్రీకాళహస్తి టిడిపి ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి కంచు కోటగా మారింది. 1983 నుంచి తొమ్మిది సార్లు సాధారణ ఎన్నికలు ఒక సారి ఉప ఎన్నిక జరిగింది. ఇందులో ఏడు సార్లు టిడిపి, రెండు సార్లు కాంగ్రెస్, ఒక సారి వైసిపి గెలిచింది.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అత్యధికంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పని చేశారు. పునర్విభజన 2009లో జరిగిన ఎన్నికల్లో గోపాల కృష్ణా రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ సి వి నాయుడు పై 12,463 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆ ఎన్నికల్లో వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత వైసిపి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పిఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి 24,349 ఓట్లు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో గోపాల కృష్ణా రెడ్డి వైసిపి అభ్యర్థి బియ్యం మధుసూదన రెడ్డిపై 7,583 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి బియ్యం మధుసూదన రెడ్డి టిడిపి అభ్యర్థి గోపాల కృష్ణా రెడ్డి పై 38,141ఓట్ల మెజారిటీ సాధించారు. అప్పటి నుంచి గోపాల కృష్ణా రెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి టిడిపి నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్నారు. ఆయనకు నారా లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టిడిపి ఏర్పడిన తరువాత 10 సార్లు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది సార్లు రెడ్డి సామాజిక వర్గం వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కమ్మ, వన్నె కుల క్షత్రియ సామాజిక వర్గం వారు ఒక్కొక్క సారి గెలిచారు. కాబట్టి రెడ్డి వర్గానికి పట్టు వున్న ఇక్కడ తిరిగి సుధీర్ రెడ్డికి టిక్కెట్టు వస్తుందని ఒక వర్గం అంటున్నారు. అయితే సుధీర్ రెడ్డి కంటే మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడుకు టిక్కెట్టు ఇస్తే మంచిదని ఒక వర్గం పట్టు పడుతున్నారు.
2004 ఎన్నికల్లో ఎస్సీవి నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిపై 13,078 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనకు సత్యవేడు నియోజక వర్గంలో కూడా పలుకుబడి ఉందని అంటున్నారు.
కాగా ఇక్కడ వన్నియకుల క్షత్రియ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున ఆ వర్గం వారికి టిక్కెట్టు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ సామాజిక వర్గానికి చెందిన సత్రవాడ మునిరామయ్య 1985లో టిడిపి టిక్కెట్టుపై ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పడంతో 1988 లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి చెంచు రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 2009 లో వన్నియకుల క్షత్రియ వర్గానికి చెందిన పిఆర్పీ అభ్యర్థి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం 24,349 ఓట్లు తెచ్చుకున్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన ఇటీవల వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.
అలాగే అదే సామాజిక వర్గానికి చెందిన కుప్పం వైసిపి ఇంచార్జి భరత్ కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. కుప్పంలో ఆ సామాజిక వర్గం ఓట్లు 35 వేలకు పైగా ఉన్నారు. అక్కడ చంద్రబాబు వారి ఓట్లు ఆకర్షించడం కోసం శ్రీకాళహస్తిలో ఆ వర్గం అభ్యర్థికి పార్టీ టిక్కెట్టు ఇస్తే మంచిదనే వాదని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యదర్శి, తంబళ్లపల్లె పరిశీలకుడు రెడ్డివారి గురవా రెడ్డి టిక్కెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు సినీనటుడు బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. అయితే సత్రవాడ ముని రామయ్య లేదా ఆయన కుమారుడు ప్రవీన్ లో ఒకరికి టికెట్టు ఆశిస్తున్నారు.