సెల్‌ఫోను పగలకోట్టడని స్నేహితుడి హత్య
తన సెల్‌ఫోను పగలకోట్టడని స్నేహితుడినే హత్య చేశారు. తనతో పాటు మరో ఇద్దరినీ కలుపుకొని మద్యం తాగుదాం రమ్మని నమ్మపలికి, వెంట తెచ్చుకున్న కత్తితో స్నేహితుడిని కదతేల్చారు. ఈ సంఘటన ఇటేవల ఎన్‌టిఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చురేపింది. తన ఫోనును అమ్మిపెట్టమన్నందుకు, ఇప్పుడే వద్దు అన్నందుకు గొడవ జరిగింది. చిన్నగొడవలో ఫోను కిందపడి పగిలిపోయింది. ఇక అమ్మడానికి పనికిరాదని, ఆ గొడవకు చివరికి చంపుకునే వరకు దారితీసింది. ఆ గొడవలో ఒకరి ప్రాణం పోయింది. మద్యం సేవించిన ఆ యువకుడు సెల్‌ఫోన్ గొడవతో స్నేహితుడిన కడతేర్చేందుకు ప్రయత్నించాడు. అందుకోసం మరికొంతమంది స్నేహితులతో కలిసి ఆ యువకుడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కత్తితో పొడిచేసి చంపేసాడు.
విజయవాడకు చెందిన స్వామి, శివ, కనక ఎంతో మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లాలన్న వీళ్లు ముగ్గురు కలిసే వెళ్లేవారు. బుధవారం ఉదయం కూడా వీరు ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. అయితే, తాగిన మత్తులో వున్న స్వామి తన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు తన సెల్‌ఫోన్ అమ్మిపెట్టమంటూ స్నేహితుడు కనకను పట్టుబట్టాడు. అయితే, అందుకు కనక నాకు రెండు రోజుల గడువివ్వు. అలోగా, నీ సెల్‌ఫోన్ కొనిపెట్టి ఎంతో కొంత డబ్బు నీకు ఇస్తాను అన్నాడు. అందుకు స్వామి ఒప్పుకోలేదు. వెంటనే అమ్మేయాలంటూ కనకను బలవంత పెట్టాడు. దాంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. తాగినమైకంలో వున్నవీరిద్దరూ గొడవపడ్డం ప్రారంభించారు. అయితే, ఈ గొడవకు అసలు ఎలాంటి కారణం లేని శివ వీరిద్ద మధ్యలో తలదూర్చాడు. గొడవకు కారణమైన మొబైల్ తీసుకుని శివ నేలకేసి కొట్టాడు. దాంతో ఆ ఫోన్ కాస్త పగిలిపోయి అమ్మేందుకు పనికిరాకుండా పోయింది.
దాంతో స్వామి శివపై కోపంతో రగిలిపోయాడు. నా ఫోన్‌నే పగలగొడతాడా అనుకుంటూ అతని మీద క్షక్ష్య పెట్టుకుంటాడు. ఆ కోపంలో ఇంటికి వెళ్లి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మళ్లీ మద్యంతాగాడు. దాంతో ఆ ముగ్గురు కలిసి శివను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మందుతాగుదామని శివకు ఫోన్ చసి రమ్మన్నారు. శివను పిలుచుకుని స్వామి కృష్ణా నది వద్దకు తీసుకెళ్తాడు. అప్పటికే అక్కడున్న మరో ఇద్దరితో కలిసి స్వామి శివను కత్తితో పొడిచి అత్యంత క్రూరంగా చంపేశాడు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమవుతుంది. శివ మృతదేహం రక్తంతో నిండి ఉంటుంది. ఈ సంఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిస్తారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివను చంపింది స్వామి అని గుర్తించి, అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.