20, నవంబర్ 2023, సోమవారం

గజరాజుల స్వైరవిహారం

వి కోటలో పంట పొలాలపై దాడి
భారీగా వరిపంట నష్టం
భయాందోళనలో.రైతులు 
కట్టడి చేయడంలో అటవీశాఖ విఫలం 


చిత్తూరు జిల్లా వి.కోట మండలం నాగిరెడ్డిపల్లి  గ్రామ చివారున ఉన్న వరి పంట పొలాపై ఆదివారం రాత్రి 15 ఏనుగులు గుంపు దాడి చేసింది.  అందినకాడికి వరి పంటను ధ్వంసం చేసాయి. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్టు రైతన్న తెలిపారు. కోత దశలో  ఉన్న వరి పంట నేల మట్టం చేయడంతో  రైతులు  తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గజరాజులు భారీ నుండి తమ ప్రాణాలను, పంటలను రక్షించాలన్నారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే  పంట పొలాల్లోకి ఏనుగులు చొరబడుతున్నాయని రైతులు మొరపెట్టుకొంటున్నారు.

వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లోని అటవీ సరిహద్దు గ్రామలైన కొమ్మరమడుగు, నాగిరెడ్డిపల్లి, కస్తూరి నగరం, రాగుపల్లి, కైగల్, తోటకనుమ, వెంగమవారిపల్లి, కడపనత్తo, గౌనీతిమ్మేపల్లి, కల్లిగుట్ట, యర్రమచేను వంటి గ్రామాల్లో తరుచుగా గజరాజులు భీభత్సం సృష్టిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రైతన్నల పంట పొలాలును ఏనుగులు నష్టం చేకూర్చినా, వారికి నష్ట పరిహారం అందిన దాఖలాలు లేవు. 

అటవీ ప్రాంతంలో వాటికి కావాల్సిన ఆహారం లభించడం లేదు. దీంతో గ్రామాల్లోకి చొరపడి పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగులు రాకుండా కంచె కూడా లేదు. రైతులు కంచె రాసుకున్న, ద్యంసం చేసి పంటపొలాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతంలో వాటికీ కావాల్సిన పంటలును పారెస్ట్ అధికారులు వేయడం లేదు. రైతులకు అవగాహన కార్యక్రమాలు లేవు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏనుగుల సంచారం పలమనేరు నియోజకవర్గo లోని ఐదు మండలాల ప్రజలను కంటి మీద  కునుకు లేకుండా చేస్తున్నాయి. సంబంధిత మండలాల పారెస్ట్  అధికారులు తక్షణ పరిష్కారం కు మొగ్గు చూపుతున్నారే తప్పా, శాశ్వత పరిష్కారంకు మొగ్గు చూపలేదని రైతన్నలు వాపోతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *