10, నవంబర్ 2023, శుక్రవారం

CM జగన్ కు తృటిలో తప్పిన ప్రమాదం



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి  తృటిలో ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కాన్వాయ్ లోని వాహనశ్రేణికి శుక్రవారం నాడు ప్రమాదం జరిగింది. రెండ్రోజులుగా కడప, అన్నమయ్య జిల్లాల్లో సీఎం పర్యటిస్తున్నారు. వేముల మండలంలో వైసీపీ నేతలతో  సమీక్ష అనంతరం ఇడుపులపాయకు  తిరుగుపయనం అయ్యే సమయంలో మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఢీ కొన్నాయి. ఇలా ఒకట్రెండు కార్లను జగన్ కారు ఢీ కొంటూ ఆగకుండా ముందుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో  వాహనం స్వల్పంగా దెబ్బతింది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు, పెద్ద ప్రమాదం కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదమే తప్పిందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. దీంతో రెండు, మూడు కార్ల వెనుక భాగం దెబ్బతిన్నది. 


అన్నమయ్య, కడప జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  రెండు రోజుల పాటు  పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడ కడప జిల్లాలోని పలు కార్యక్రమాల్లో  సీఎం జగన్ పాల్గొన్నారు.  ఇడుపులపాయలో  సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన తన కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో  ప్రమాదం చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ లోని  వాహనశ్రేణిలో రెండు వాహనాలు ఢీకొన్నాయి.  ముందున్న వాహనాన్ని వెనుక నుండి వచ్చిన వాహనం ఢీకొట్టింది .ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న వాహనం స్వల్పంగా దెబ్బతింది.


ఈ కాన్వాయ్ లో ఉన్న వాహానాల్లో ప్రయాణీస్తున్న ఎవరికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్  వాహన శ్రేణిలో ప్రమాదం జరిగిందని తెలిసి అంతా కంగారు పడ్డారు. అయితే జగన్ ప్రయాణీస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకుని అంతా ఊపిరిపీల్చుకున్నారు.




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *