వాలంటీరుపై వైసీపీ ఎమ్మెల్యే అత్యాచారయత్నం !?
వైసీపీ ఎమ్మెల్యే తనపై అత్యాచార, హత్యా యత్నం చేశారని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన వాలంటర్ శ్వేత మీడియా ముందు ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ఎంపీటీసీ, ఎంపీపీ కూడా తనపై అత్యాచార యత్నం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం ఎవరికైనా చెప్పితే హత్య నేరం కింద పోలీసు కేసు పెట్టి జైలుకు పంపుతామని తల్లిదండ్రులను కూడా భయపెడుతున్నారని తెలిపారు.
ఈ సారి టిక్కెట్ రాదు అని బహిరంగంగా వైసిపి ఎమ్మెల్యే వసూళ్ళు చేస్తున్నారని పేర్కొన్నారు. సొంత పార్టీ వాలంటర్ అయిన తనను వైసిపి ఎమ్మెల్యే, ఎంపీటీసీ, ఎంపీపీ శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, వేధిస్తున్నారని వివరించారు. మాకు ఎదురు తిరుగుతే చంపేస్తాం అంటు బహిరంగంగానే వైసిపి ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని తెలిపారు. విషయం బయటకు చేపుతే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాను అంటు వాలంటర్ ను తల్లీ తండ్రులను భయపెడుతున్న వైసీపి ఎమ్మెల్యే వేధిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే దొంగ కేసులు పెడుతూ ఇబ్బందిలు పెడ్తున్నారు అంటు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. వారి దాడిలో ఇప్పటికే తమ సోదరుని తల కూడా పగిలిందన్నారు. ఆస్పత్రిలో కుట్లు కూడా పడ్డాయని చెప్పారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆ ఎమ్మెల్యేతో తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని వాలంటర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ఎమ్మెల్యే నుండీ తమ కుటుంబాన్ని కాపాడండి అంటూ వాలంటీర్ కన్నీటి పర్యంతమయ్యారు.