కృష్ణానది జలాలపై 20న విజయవాడలో 30 గంటల దీక్ష
సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు తీవ్ర విమర్శ
కృష్ణానది జలాల పునః పంపిణీ పై కేంద్రo లోని బిజెపి మోడీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ నవంబర్ 20, 21వ తేదీన విజయవాడలో జరిగే 30 గంటల దీక్షను జయప్రదం కోరుతూ గోడపత్రికలను సిపిఐ నగర కార్యదర్శి వి సి గోపీనాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీల కృష్ణా నది జలాలను కేటాయించిందన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు కేటాయిస్తే కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో లబ్ధిపొందడానికి కృష్ణాజిల్లాల పూన: పంపిణీపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గం చర్య అన్నారు.
కృష్ణా నది జలాల పూన: పంపిణీ పై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని, రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నవంబర్ నెల 20, 21వ తేదీన విజయవాడలో జరిగే 30 గంటల నిరసన దీక్షలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి. సి .గోపీనాథ్, కే. మణి, దాసరి చంద్ర, కే .విజయ గౌరీ, కే.రమాదేవి, జిల్లా సమితి సభ్యులు ఏ.జమీలాభి, బి.కుమారి, కే.లత, పి.గజేంద్ర బాబు, హెచ్ .బాలాజీ రావు, పి. రఘు, కే. నాగరాజా, ఎన్. జలంధరన్, ఇ .డేవిడ్, కే చంద్రయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.