తెగని జి డి నెల్లూరు పంచాయితి !
MLC రాంభుపాల్ రెడ్డి సమక్షంలో పంచాయితీ
చిట్టిబాబుపై, థామస్ మీద ఫిర్యాదుల వెల్లువ
క్షమాపణలు చెప్పిన చేట్టిబాబు
వెనక్కి తగ్గని మండల పార్టీ అధ్యక్షులు
కలిసి పనిచేయలేమని తెగేసి చెప్పిన వైనం
చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సుదీర్ఘంగా ఇటువంటిగంగాధర నెల్లూరు నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు కానీ, ఇతర నిర్ణయాలు కానీ తీసుకోలేకపోయారు. మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీపావళి పండుగ తర్వాత ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క వారం సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సమావేశానికి పార్లమెంట్ పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు మబ్బు దేవనారాయణ రెడ్డి కూడా హాజరుకానున్నారు. వరుసగా ఐదారు సమావేశాలు జరిగితేనే గంగాధర నెల్లూరు రాజకీయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయని సభ్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో 11 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయము తీసుకోకనే వాయిదా పడింది. సమావేశాన్ని రహస్యంగా నిర్వహించారు. విలేకరులను అనుమతించలేదు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్యయకర్తగా చిట్టిబాబు నియమితులైన అప్పటినుంచి నియోజకవర్గంలో వర్గ విభేదాలు ప్రారంభమయ్యాయి. చిట్టి బాబుకు అప్పటి నుంచే మండల పార్టీ అధ్యక్షులు ఎవరు సహకరించడం లేదు. అయినా చిట్టిబాబు నియోజకవర్గంలో పార్టీని అన్ని తానై నడిపిస్తూ వచ్చారు. అనంతరం థామస్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంతో నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఇటీవల చిట్టి బాబుకి చెందిన రేవా రిసార్టులో మంత్రి రోజా భర్త సెల్వమణి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం దుమారం లేపింది. చిట్టిబాబు రోజా దంపతులకు ఆదిత్య ఇచ్చారన్న వార్త జిల్లా, రాష్ట్రస్థాయిలో గుప్పుమంది. దీనితో చిట్టి బాబు మీద ఫిర్యాదుల పరంపర ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈ విషయమై తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతానికి చిట్టిబాబును పక్కన పెట్టాలని పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు రాంభూపాల్ రెడ్డి ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంచార్జ్ థామస్ ఒంటరి వారయ్యారు. ముందుండి థామస్ ను నడిపించిన చిట్టి బాబును పార్టీకి దూరం పెట్టడంతో థామస్ తన భార్య, సోదరునితో కలిసి ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆయనకు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు ఎవ్వరూ సహకరించడం లేదు.
ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రమైన చిత్తూరులో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మబ్బు దావనారాయణరెడ్డి హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిలు, నియోజకవర్గ ఇన్చార్జ్ థామస్ పాల్గొన్నారు. పరిశీలకులు ఒక్కొక్కరిని వేరుగా పిలిచి తమ అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమావేశాన్ని హాజరైన నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ చిట్టి బాబును ఒక ప్రత్యేక గదిలో కూర్చోబెట్టారు. ఇక్కడ జరుగుతున్న తతంగం, ఆరోపణలు ఆయనకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. పరిశీలకులు ప్రత్యేకంగా ఒక్కొక్కరితో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు.
బుధవారం జరిగిన సమావేశానికి 22 మంది మండల స్థాయి నాయకులు హాజరైనట్లు సమాచారం. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్చార్జులు చిట్టిబాబు మీద ఆరోపణలు, విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. చిట్టిబాబు ఒంటెద్దు పోకడగా పార్టీ తమది అనే భావంతో ఎవరిని కలుపుకోకుండా వ్యవహరిస్తున్నారని పరిశీలకులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చిట్టిబాబు తన రిసార్టును రోజా దంపతులకు ఇవ్వడం పట్ల ముఖ్యంగా చర్చ జరిగింది. తన రిసార్టును రోజాకు ఆతిథ్యం ఇచ్చారని, ఆమెకు ఆమె, భర్తకు ఖరీదైన బహుమతులు ఇచ్చారని కొందరు పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎందుకు అవసరమైన సాక్షాధారాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలకులు అడిగినట్లు సమాచారం. ఏమీ లేవని చేప్పినట్లు తెలిసింది. అలాగే రిసార్టులో కోవర్టు రాజకీయాలు జరిగాయని, చిట్టి బాబు అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ఒక క్వారీని కూడా తీసుకున్నారని ఆరోపించినట్లు సమాచారం.
అలాగే నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన థామస్ చిట్టిబాబు అండ చూసుకుని తమను ఖాతర చేయడం లేదని చేసినట్లు తెలిసింది. మండలంలో మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్న తమను పక్కనపెట్టి, వ్యతిరేకుల ఇళ్ళకు పోవడానికి ముఖ్యంగా ప్రస్తావించినట్లు తెలిసింది. వారం రోజుల కిందట చిత్తూరులో జరిగిన నియోజకవర్గ సమావేశంలో థామస్ మాట్లాడుతూ తనకు సహకరించకపోతే మండల పార్టీ అధ్యక్షులను కూడా పక్కన పెట్టి, ముందుకెళతానని, అవసరమైతే వారి మీద క్రమశిక్షణ చర్యలు కొంటామని అన్న విషయాన్ని కూడా పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా, 10 సంవత్సరాలుగా పార్టీలో ఉన్న తమను నిన్న లేకుండా మొన్న వచ్చిన థామస్ బెదిరించడం ఏమిటని ప్రశ్నించారని
సమాచారం.
మండల అధ్యక్షులు రుద్రయ్య నాయుడు, జయశంకర్ నాయుడు, స్వామి దాస్, రాజేంద్ర, చెంగల్రాయ యాదవ్ చిట్టిబాబుపై పలు ఆరోపణలు చేశారని తెలిసింది. గతంలో చిట్టి బాబును సమన్వయ కర్తగా నియమించడం వల్లనే మాజీ మంత్రి దివంగత గుమ్మడి కుతూహలమ్మ కుమారుడు డాక్టర్ హరికృష్ణ పార్టీకి రాజీనామా చేశారని కొందరు ప్రస్తావించారు. చిట్టిబాబు వర్గ తత్వం వల్ల పెనుమూరుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి తన సభ్యత్వాన్ని తిరుపతికి మార్చుకున్నారని కొందరు చెప్పారు. దీని వల్ల రెడ్డి సామాజిక వర్గం పార్టీకి దగ్గర కావడం లేదని వివరించారు. నియోజక వర్గంలో పార్టీ దెబ్బ తినడానికి కారణమైన చిట్టి బాబును దూరం పెట్టాలని సూచించారు.
చివరకు చిట్టిబాబు మాట్లాడుతూ తెలిసో తెలియకో తాను తాను ఎవరినైనా తప్పుగా మాట్లాడినా, తన చర్యల వల్ల ఎవరి మనసైనా గాయపడినా మన్నించమని క్షమాపణలు అడిగినట్లు సమాచారం. పార్టీ నిర్ణయం మేరకు భవిష్యత్తులో నడుచుకుంటారని, నన్ను పార్టీలో ఉండమంటారా వద్దా అనే విషయాన్ని తేల్చాలని కోరినట్లు సమాచారం. అలాగే తాను పార్టీలో పనిచేయాల్సి వస్తే తన పరిధిని కూడా నిర్ణయించాలని కోరినట్లు తెలిసింది. నియోజకవర్గ ఇన్చార్జ్ థామస్ మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి NB సుధాకర్ రెడ్డి మీద విమర్శలను ఎక్కుపెట్టినట్లు సమాచారం. NB సుధాకర్ రెడ్డి ఒక పత్రికను నడుపుతున్నారని, పత్రిక ద్వారానే పార్టీ అప్రతిష్ట పాలవుతుందని పరిశీలకులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. NB సుధాకర్ రెడ్డిని కట్టడి చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.
సమావేశానికి విచ్చేసిన పరిశీలకులు రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడిన సమయంలో పార్టీ ఎవరిని వదులుకోవడానికి సుముఖంగా లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విభేదాలను పక్కనపెట్టి అభ్యర్థి విజయానికి సహకరించవలసిందిగా కోరారు. మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ ఇంచార్జ్ కలిసికట్టుగా పనిచేసి YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారాయణస్వామిని ఓడించాలని పిలుపునిచ్చినట్లు తెలిసింది. తదుపరి సమావేశంలో మాట్లాడి అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుందామని కుందామని, అందరూ పార్టీ అభివృద్ధికి కృషి చేద్దామని అన్నట్లు సమాచారం.
అనవసరమైన వాట్సప్ గ్రూపులను తొలగించాలని, వాట్సప్ అడ్మిన్ లుగా మండల అధ్యక్షులు మాత్రమే ఉండాలని సూచించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తగదని హెచ్చరించారు. తన వల్ల పొరపాటు జరిగి ఉంటే క్షమించమని అందరినీ కోరారు. ఇదిలా ఉండగా ఇంచార్జి థామస్ గత కొంత కాలంగా తన భార్య, తమ్ముడు, కుటుంబ సంభ్యలను వెంట పట్టుకుని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పలు అంశాలు తెలుసుకున్న రాంభూపాల్ రెడ్డి అధిష్టాన వర్గానికి నివేదిక సమర్పిస్తామని తెలిపినట్టు ఒక నాయకుడు చెప్పారు.