29, నవంబర్ 2023, బుధవారం

సజ్జలకు కోర్టు నోటిసులు


వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాధనాన్ని వినియోగించి, ప్రభుత్వ ఉద్యోగులతో వై ఏపీ నీడ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం సర్వీస్ రూల్స్ కు విరుద్ధం దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధమని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్ ఈ పిటీషన్ పై తమ వాదనలు వినిపించారు. 


దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అనేందుకు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. కార్యక్రమానికి హాజరు కాలేదని గుత్తి మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగికి మెమో జారీ చేసిన అంశాన్ని  న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. వై ఏపీ నీడ్స్ జగన్ ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై పిటీషనర్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, ప్రభుత్వ సొమ్ము వాడటం చట్ట వ్యతిరేకమన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచన ఇచ్చారని కోర్టుకు తెలిపారు. దీంత ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సజ్జల, సీఎస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


ఈ పిల్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా, విచారణ అర్హత ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ సొమ్ముతో సీఎం జగన్ రాజకీయ ప్రచారం చేస్తున్నారని కోర్టుకు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందన్నారు. ఈ మేరకు జీవో నెంబర్ 7 విడుదల చేశారని కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సజ్జల చెప్పారని కోర్టుకు తెలిపారు. ఇలా చెప్పడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమన్నారు. వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.


వై ఏపీ నీడ్స్ జగన్ రాజకీయ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నిలువరించాలని హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలైంది. రాజకీయ కార్యక్రమానికి ప్రభుత్వ ధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలని మంగళగిరికి చెందిన జర్నలిస్టు ఈ పిటిషన్ వేశారు. పలువురు అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో కోరారు.


రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసేలా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ప్రభావితం చేసేలా ఈ కార్యక్రమం ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని.. కార్యక్రమంలో పాల్గొనని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. నిజానికి.. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి కూడా మద్దతు తెలపడకుండా తటస్థంగా ఉండాలని నిబంధలు చెబుతున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *