చిత్తూరులో సిపిఐ సంఘీభావ దీక్ష
కృష్ణానది జలాల పున: పంపిణీ పై గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని, సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న 30 గంటల దీక్షకు సంఘీభావంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ .నాగరాజు మాట్లాడుతూ ఇప్పటికే అధికారంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం, ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీ చట్టాలను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా ప్రజలను దగా చేసిందని త్రివంగా విమర్శించారు. ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలను మోడీ ప్రభుత్వం దగా చేస్తుంటే రాష్ట్రంలో అధికారులు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించకపోవడం శోచనీయమన్నారు.
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బచావత్ ట్రిబనల్ ప్రకారం 811 టీఎంసీలు కేటాయిస్తే, రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు కేటాయిస్తే బిజెపి మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అధికారంలోకి రావడానికి కుట్రలు పన్ని కృష్ణ జలాల పున:పంపిణీ పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో వర్షం లేకపోవడంతో సుమారు 400 మండలాలకు పైగా కరువుతో రైతులు అల్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే 103 మండలాల్లో కరువు ఉందని ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కరువు ప్రాంతాలను ప్రకటించి సహాయక చర్యలు చేపడతా ఉంటే మన రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడం చాలా అన్యాయం అన్నారు. ఇప్పటికైనా కరువు మండలాలు గుర్తించి కరువు నివారణ సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా నది జలాల పున:పంపిణీ పై గజట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, రాయలసీమ జిల్లాల్లో వలసలు, రైతుల ఆత్మహత్యలు ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల్ని, రైతులని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమ చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు.
నిరసన దీక్షలో సిపిఐ నాయకులు కే.మణి ,పి. మార్ కొండయ్య, కే. రామమూర్తి, కే. విజయ గౌరీ, కే.రమాదేవి, కోమల, లత రెడ్డి, హెచ్. బాలాజీ రావు, పి. గజేంద్ర బాబు, ఎం .మునస్వామి, బి.బాలాజీ, యస్.రమేష్ బాబు నాగమ్మ, కే .పరదేశి, వెంకటేష్, గణేష్, మునేశ్వర్, లక్ష్మి, శోభ, రాణి, జ్యోతి, జయమ్మ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.