11, నవంబర్ 2023, శనివారం

జాబ్ కాలండరును విడుదల చేయాలని నిరసన

 


జాబ్ కాలండర్ ను వెంటనే విడుదల చేయాలనీ,  ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు  ప్రధాన కూడలి గాంధీ విగ్రహం వద్ద తెలుగు యువత,  జనసేన నాయకులు  నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అమలు కానీ నోటిఫికేషన్ లతో మరోసారి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా చిత్తూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కాజూరు రాజేష్  ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద జనసేన నాయకులతో కలిసి నిరసన చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు మంజుష్ అలాగే చిత్తూరు నగర అధ్యక్షుడు యువరాజ్ ఉపాధ్యక్షుడు నవీన్, రాంప్రసాద్, గౌస్, విజయ్, సాయి, 19వ వార్డు ఇన్చార్జి గౌతమ్, గణేష్, గోకుల్, బాలాజీ,అధిక సంఖ్యలో తెలుగు యువత నాయకులు పాల్గొనడం జరిగింది, అదేవిధంగా జనసైనికులు యశ్వంత్, సంతోష్, లోచన్ బాబి, భరత్, సాయి తదితరులు పాల్గొన్నారు. 



భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్  135వ జయంతి, మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆజాద్ చిత్రపటానికి తెదేపా నాయకులు ఘన నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర సమరయోధులు, తొలి విద్యాశాఖ మంత్రిగా పలు గ్రంథాలను రాసి ప్రచురించి, మహాకవిగా, పండితులుగా,అద్భుత మేధాశక్తి గల, ధార్మికవేత్తగా ఎనలేని ఖ్యాతిని అర్జించారు. ప్రతి ఏటా ఆయన జయంతి నాడు భారత దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ ఎమ్మెల్సీ బి.ఎన్. రాజసింహులు @దొరబాబు అన్నగారు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కాజూర్ బాలాజీ, జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి నౌషాద్, పార్లమెంట్ ప్రధాన మైనార్టీ కార్యదర్శి సయ్యద్ ఫిరోజ్, నగర అధ్యక్షులు ఎస్ అక్తర్ భాష, నగర ప్రధాన కార్యదర్శి నవాజ్ భాష,  మైనార్టీ నాయకులు ఆన్సర్, అబ్దుల్ రియాజ్, జాఫర్, జిలాని, మహబూబ్ బాషా,ఆన్సర్, గౌస్ బకష్,హాకీమ్ గౌస్,మహమ్మద్, అక్బర్ బాషా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు.                                                                                                                                                      

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *