28, నవంబర్ 2023, మంగళవారం

రెడ్ల కోట పుంగనూరు



పుంగనూరు నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోటలా నిలబడుతోంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థిని ప్రకటించినా, రెడ్డి సామాజిక వర్గం వారికే కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. తెదేపా ప్రారంభంలో BC సామాజిక వర్గానికి చెందిన బగ్గీడి గోపాల్ TDP MLAగా ఎన్నికయ్యారు. అనంతరం అయన కాంగ్రెస్ పార్టీలో చేరినా, పోటీచేసే అవకాశం లభించలేదు. 2009, 2014 ఎన్నికలలో BC సామాజిక వర్గానికి చెందిన క్షత్రియ వెంకటరమణ రాజు పోటి చేసినా, ఒక సారి 42 వేల ఓట్లు, మరో సారి 32 ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయన ప్రస్తుతం YSR కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. PV నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఒక సారి పుంగనూరు నుండి బ్రాహ్మణ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేసినా, డిపాజిట్టు కూడా రాలేదు.

పుంగనూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో 1983లో BC గాండ్ల సామాజిక వర్గానికి చెందిన బగ్గిడి గోపాల్ తెదేపా పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికలలో  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే విజయం సాధించారు. 1985, 19891, 994 జరిగిన ఎన్నికలలో వరుసగా నూతనకాల్వ రామకృష్ణారెడ్డి TDP తరపున హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి TDP అభ్యర్థిగా విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. తిరిగి 2004లో జరిగిన ఎన్నికల్లో అమర్నాథరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009, 2014, 2019 ఎన్నికలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస విజయాలను నమోదు చేస్తూ హ్యాట్రిక్ సాధించారు.

నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణలో పుంగనూరు నుండి కొన్ని మండలాలు, పీలేరు నుండి కొన్ని మండలాలను చీల్చి, పుంగనూరు నియ్యోజక వర్గాన్ని ఏర్పాటు చేశారు. పీలేరు నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వరుసగా రెండు పర్యాయాలు 1983, 1985 ఎన్నికలలో చల్లా ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జీవి శ్రీనాథ్ రెడ్డి గెలుపొందారు. అనంతరం 1999, 2004లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009 ఎన్నికలలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికలలో చింతల రామచంద్రారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక్కసారి కూడా రెడ్డి కమ్యూనిటీ కాకుండా వేరేవాళ్లు విజయం సాధించిన దాఖలాలు లేవు. 

                                   


రొంపిచర్లకు చెందిన చల్లా  రామచంద్రా రెడ్డి 1989లో పీలేరులో TDP అభ్యర్థిగా పోటి చేసి, పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అయన తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి 1983,1985 ఎన్నికలలో  పీలేరు నుండి TDP అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1985లో  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఓడించారు. తాత CK నారాయణ రెడ్డి కూడా పీలేరు MLAగా పనిచేశారు. మరో తాత TTD పేష్కర్  గా పనిచేశారు. చల్లా  రామచంద్రా రెడ్డి కూడా TTD పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. కుటుంబ సభ్యులు, ఆయన  రొంపిచెర్ల MPP, Z P T C గా పనిశారు. 2019 ఎన్నికల తరువాత అనిషా రెడ్డిని నియోజక ఇన్చార్జిగా తొలగించి, చల్లా రామచంద్రా రెడ్డిని నియమించారు. పుంగనూరుకు చంద్రబాబు వచ్చిన సమయంలో పోలీసులపై దాడి జరగడం, చంద్రబాబుతో పాటు వంద మందికి పైగా తెదేపా నాయకులు, కార్యకర్తల మీద పొలీసు కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటనతో చంద్రబాబు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అండదండలు చల్లా బాబుకు ఉన్నాయి. అయన చల్లా బాబు కోసం పట్టుపట్టే అవకాశం ఉంది.  



నూతనకాల్వ అనిషా రెడ్డి 2019 ఎన్నికలలో తెదేపా అభ్యర్థిగా పోటి చేసి, 43 వేల ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయారు. మొదటి నుండి పుంగనూరు నియోజకవర్గం నూతనకాల్వ కుటుంబానికి కంచుకోటగా ఉండేది. అయితే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పుంగనూరు నియోజకవర్గం వైసిపి చేతిలోకి వెళ్ళింది. పుంగనూరు నియోజకవర్గం నుంచి అనిషారెడ్డి మామ నూతనకాల్వ రామకృష్ణారెడ్డి 1985 ఎన్నికల నుండి వరసగా మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 1996లో  పార్లమెంట్ సభ్యులుగా ఎంపిక కావడంతో పుంగనూరుకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో అమర్నాథరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి చేతిలో అమర్నాథరెడ్డి ఓడిపోయినా, 2004 ఎన్నికల్లో తిరిగి పుంగనూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి YCP ఎమ్మెల్యేగా ఎన్నికైన అమన్నాథరెడ్డి, తెలుగుదేశం పార్టీలో చేరి, ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రామకృష్ణారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మరో  మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అయన కుమారుడు అమరనాధ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా  మూడు సార్లు ఎన్నికయ్యారు. రాజకీయ నేపథ్యం ఉన్న అనీషారెడ్డి కూడా మళ్ళి పార్టీ తనకు అవకాశం ఇస్తే, పోటి చేయడానికి సిద్దంగా ఉన్నారు.




బలిజ సామాజిక వర్గానికి చెందిన CM సురేష్ కూడా ఈ సారి
 తెదేపా టిక్కెట్టును ఆశిస్తున్నారు. సోమల మండలానికి చెందిన అయన ఇది వరకు ప్రజారాజ్యం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడుగా పనిచేశారు. 2017లో కిశోర్ కుమార్ రెడ్డి ఆధ్యర్యంలో తెదేపాలో చేరారు. ప్రస్తుతం తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. నియిజకవర్గంలో బలిజ సామాజిక ఓట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. కావున తనకు అవకాశం ఇవ్వలాలి కోరుతున్నారు.

2019  ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటి చేసిన బొడే రామచంద్ర యాదవ్ కూడా పోటి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయన కొత్తగా పార్టీని ప్రారంభించారు.  ఇటివల తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడును కలిసి పొత్తుల విషయమై మాట్లాడినట్లు సమాచారం. ఆయనకు గత ఎన్నికల్లో  16,452 ఓట్లు వచ్చాయి. యాదవ్ రామచంద్రా రెడ్డికి వ్యతిరేకంగా పుంగనూరులో పోరాటం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు రోజు ఓటర్లకు అందరూ డబ్బులు పంచితే, యాదవ్ మాత్రం స్లిప్పులను పంపిణీ చేసి, గెలిస్తే ఆ స్లిప్పు తీసుకొని వస్తే రెండు వేలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.   

 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *