20, నవంబర్ 2023, సోమవారం

బాబుకు బెయిలోచ్చింది!

 


టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఎట్టికేలకు రెగ్యులర్ బెయిలు మంజురయ్యింది. ఈ మేరకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబుకు భారీ ఉపశమనం లభించింది. దీంతో జిల్లాలోని తెలుగుదేశం శ్రేణులు సంభరాలు చేసుకున్నాయి. ఈ కేసులోనే చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధిత కారణాలతో మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసింది. ఇక, ఇప్పుడు సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. 53 రోజులు జైలు లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు కు ఈ తీర్పు భారీ ఉపశమనంగా మారనుంది.


డప్పు వాయిద్యాలు వాయిస్తూ తెలుగు తమ్ముళ్లను ఉత్సాహపరిచిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో గత వారమే విచారణ పూర్తి చేసింది. స్కిల్ కేసులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఎన్నికల ముంగిట చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారని లూథ్రా వాదించారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు. చంద్రబాబును ఇరికించడం కోసమే ఫోరెన్సిక్ రిపోర్టు తయారు చేశారని లూథ్రా ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.


కార్వేటి నగరం మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అన్నూరు క్రాస్ రోడ్ వద్ద టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్న నాయకులు కార్యకర్తలు

చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ విచారణ సమయంలో అనారోగ్య కారణలతో మధ్యంతర బెయిల్ కోర్టు మంజారు చేసింది. యాభై రెండు రోజుల పాటు రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బయటకు వచ్చారు. ఆ సమయంలో కొన్ని కండీషన్లు స్పష్టం చేసింది. ఈ నెల 28న చంద్రబాబు తిరిగి జైలులో సరెండర్ కావాలని సూచించింది. మరో వారం రోజుల్లో ఈ సమయం ముగుస్తుండటంతో రెగ్యులర్ బెయిల్ పైన తీర్పు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్దించారు. అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైనా విచారణ పూర్తయింది. హోరా హోరీగా సాగిన వాదనల తరువాత సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ వారంలోనే క్వాష్ పైన తీర్పు వెలువడే అవకాశం ఉంది.

 గుడుపల్లి మండలం యామిగానిపల్లె గ్రామంలో భారి ర్యాలీ 

ఇటు, ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితునిగా ఉన్న సీమెన్స్‌ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్‌షా అప్రూవర్‌గా మారారు. చంద్రకాంత్‌ను డిసెంబర్‌ 5న హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా వేసింది. చంద్రబాబు ప్రస్తుతం కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయటంతో భారీ రిలీఫ్ దొరికింది. రాజకీయంగానూ కీలకంగా మారుతోంది. అయితే, బెయిల్ మంజూరు విషయంలో కోర్టు ఏమైనా కండీషన్లు విధించిందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *