18, నవంబర్ 2023, శనివారం

వేపచెట్టు నుండి ధారగా పాలు !




వేపచెట్టుకు పాలు కారేనయా ... అది తాగితే మానవుల రోగాలు తగ్గేనయా ... అంటూ  మన బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. అది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో నిజం అయ్యింది. ఇది దేవుని మహిమ అని మహిళలు భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. వేపచెట్టు నుండి కారే పాలను తీర్థంగా సేవిస్తున్నారు. దీంతో ప్రజల రోగాలు కూడా తగ్గుతున్నాయి. డాక్టర్ అవసరం లేకుండానే రోగాలు తగ్గుతుండటంతో ప్రజలు పోటేత్తుతున్నారు. ఎప్పుడూ అదొక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ప్రతేక పూజలు చేస్తున్నారు. 


ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఓ వేప చెట్టు నుంచి ధారాపాతంగా పాలు కారుతుంది. ఈ పాలను తాగితే రోగాలు నయమవుతున్నాయి. ఆ ఉరు ఇప్పుడో చిన్నపాటి పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఫిరోజాబాద్‌లోని నసీర్ పూర్ సమీపంలో ఉన్న వేప చెట్టు నుంచి చిక్కగా పాల వంటి ద్రవం కారుతోంది. ఇది సర్వరోగాలనూ హరించే ద్రవమని నమ్ముతున్న ప్రజలు, తండోపతండాలుగా ఆ చెట్టు వద్దకు వస్తున్నారు.


చెట్టు నుంచి కారుతున్న పాలు పట్టుకుని వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఆ ప్రాంతమంతా భజనలు మారుమ్రోగుతుండగా, వందలాది మంది ఇది దేవుని మహిమేనంటూ.. ఆ వేప చెట్టుకు పూజలు కూడా చేస్తున్నారు. దీనిపై ఒక ప్రముఖ సైంటిస్ట్ స్పందిస్తూ, ప్రజలు మూఢనమ్మకంతో భగవంతుని మహిమని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వేపలో సహజంగానే యాంటీ బాక్టీరియా గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయని, అందువల్లే ఈ ద్రవం తాగిన తరువాత చిన్న చిన్న వ్యాధులు, నొప్పులు తగ్గుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *