4, నవంబర్ 2023, శనివారం

చిత్తూరులో భారీగా బంగారం దోపిడీ


చిత్తూరు పట్టణంలో శనివారం సాయంకాలం భారీ ఎత్తున బంగారు దోపిడీ జరిగింది. సినిమా పక్కిలో కేటుగాళ్లు కారులో ఉన్న 40 లక్షల రూపాయల విలువచేసే బంగారును కొట్టేశారు. ఎవ్వరికి అనుమానం రాకుండా అక్కడి నుండి చల్లగా జారుకున్నారు. విషయం తెలుసుకున్న గోల్డ్ కంపెనీ మేనేజర్ జాన్ బాబు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దొంగలను పట్టుకోవడానికి  ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, విచారణ  చేస్తున్నారు.


చిత్తూరు ప్రకాశం హై రోడ్డులోని, రైల్వే స్టేషన్ ఎదురుగా కీర్తన గోల్డ్ లోన్స్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ బంగారు నగలను కుదువ పెట్టుకుని రుణాలను ఇస్తుంది. ఎక్కడ భారీగా బంగారు జమ కావడంతో ఆ నగలను తీసుకుని వెళ్ళడానికి  రీజనల్ మేనేజర్ జాన్ బాబు వచ్చారు. శనివారం సాయంత్రం బంగారు నగలన్నీ ప్యాక్ చేసి తీసుకొని వచ్చి,  రోడ్డు మీదున్న కారులో పెట్టారు. అనంతరం హోటల్ గదికి వెళ్లి గదిని ఖాళి చేసి తిరిగి కారు వద్దకు వచ్చాడు. మేనేజర్ కు దిమ్మతిరిగి పోయింది. కారులోని బంగారు నగలు  మాయమయ్యాయి. వేసిన డోర్లు వేసినట్లే ఉన్నాయి. బంగారు నగలు కనిపించక పోవడంతో చుట్టుపక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ కారులో సుమారు 45 లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నట్లు కీర్తన బోర్డు లోన్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ జాన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ఈ విషయమై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారు నగలను కొట్టివేయడంలో ఎవరి ప్రమేయం ఉందని పలు కోణాలలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందుకోసం చిత్తూరు డిఎస్పి శ్రీనివాసమూర్తి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటి దొంగల ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. బయట వ్యక్తుల ప్రమేయం పైన కూడా విచారణ జరుపుతున్నారు. సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ దాడిలో ఐదు మంది వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. గతంలో ఇలా బంగారు నగలు కొట్టేసిన ముఠాలపైన పోలీసులు దృష్టిని సాధించారు. ఈ విషయాన్ని సవాల్ గా తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *