31, అక్టోబర్ 2023, మంగళవారం

బాబుకు బెయిలొచ్చింది - టిడిపికి పండగొచ్చింది

 


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షరతులతో కూడిన బెయిలు మంజూరు అయ్యింది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. దీపావళి పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్టు పట్టణము, పల్లె అని లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాణాసంచా, టపాకాయలు కాలుస్తూ పండగ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడుకు  అనుకూలంగా, జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు చోట్ల స్కూటర్ ర్యాలీలు జరిగాయి. రంగులు చల్లుకొని పండగ చేసుకున్నారు. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. జిల్లాలో ఒక రకమైన పండుగ వాతావరణం నెలకొంది. టిడిపి నాయకుల ఆనందోత్సాహాలకు అంతులేదు. 52 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు బెయిల్ మీద విడుదల కావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంచి హుషారు మీద ఉన్నారు. 



తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు  మద్యంతర బెయిల్ పై బయటకు రావడం పై సంతోషం వ్యక్తపరుస్తూ ఇరు పార్టీల నేతలు అలిపిరి పాదాలు దగ్గర కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం సుగుణమ్మ  ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు  డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్  హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, నగర ఉపాధ్యక్షులు పార్ధు, బాబ్జి, టీడీపీ మాజీ MLA సుగుణమ్మ, మాజీ MLC గౌను వారి శ్రీనివాసులు, వూక విజయ్ కుమార్ దంపూరి భాస్కర్, R C మునికృష్ణ తదితర టీడీపీ నాయకులు, జనసేన నగర కార్యదర్శి కిరణ్ కుమార్, తిరుపతి రూరల్ నాయకులు మనోజ్ కుమార్, గౌస్ బాషా జనసేన నాయకులు,జనసైనికులు మోహిత్, వీరమహిళలు దుర్గ, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.



చంద్రబాబుకు బెయిలు వచ్చిన సందర్భంగా చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద నాయకులు టపాకాయలు కాల్చారు. స్వీట్స్ పంచుకున్నారు. రంగులు చల్లుకున్నారు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్యనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుకున్నారు. 



తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు  మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సందర్బంగా కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు.  బాణాసంచా కాలుస్తు  కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీకాంత్ సంబరాలు చేసుకున్నారు. 



మదనపల్లిలో చంద్రబాబు బెయిల్ తో ముందస్తుగా దీపావళి సంబరాలు జరుపుకున్నారు. పట్టణ వీధుల్లో ర్యాలీలు నిర్వహించి ప్రధాన కూడళ్లలో భాణసంచా కాల్చి  దొమ్మలపాటి రమేష్ వేడుకలు నిర్వహించారు. మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి పట్టణం నందు మదనపల్లి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి దొమ్మలపాటి రమేష్ గారి అదేర్యంలో  తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడళ్లలో భాణసంచ కాల్చి వేడుకలు నిర్వహించారు.  మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లి నందు 101 టెంకాయలు కొట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ... నిజం ఎన్నటికైన గెలుస్తుంది స్క్వాష్ పిటిషన్ లో  నారా చంద్రబాబు నాయుడు  ఏ మచ్చలేని చంద్రుడిలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.



జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, చిత్తూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శశి కార్ బాబు, చిత్తూరు నగర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బాబు రెడ్డి చిత్తూరు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఎం కుమార్, చిత్తూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ కార్య నిర్వాహ కార్యదర్శి కంద స్వామి పాల్గొన్నారు.



 చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా రాష్ట్ర తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి యస్.యం.పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీ లో నాయకత్వంలో తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట జ్యోతి బస్టాండు నందు పెద్ద యెత్తున బాణాసంచా కాల్చి చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారాలోకేష్ గారి వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.  నారా.చంద్రబాబు, నారా.లోకేష్, పవన్ కల్యాణ్  నాయకత్వంలో ఈ రాష్ట్రానికి పట్టిన శని విడుదల కావాలని ఆమె అన్నారు . జనసేన పార్టీ మండల అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు  బెయిల్ మంజూరు తమకు చాలా సంతోషం కలిగించింది అని చంద్రబాబుకు   సంఘీభావం తెలియచేశారు. ఈకార్యక్రమంలో చావిడి కిట్టన్న, రవికుమార్,ప్రభాకర్, మస్తాన్ రెడ్డి, శత్రుజ్ణ, మదార్ వలి, రెడ్డెప్ప, వెంకటరమణారెడ్డి, మధుసూదన రెడ్డి, ఆంజనేయులు, షఫీవుల్లా, ఇ.చంద్రశేఖర, యం.శంకర ,పలక.రవి, పలక.రమణమ్మ, రెడ్డెమ్మ, శంకర రెడ్డిపీరా, మల్లెల.వెంకట్ రెడ్డి జనసేన పార్టీకి చెందిన  మునిరాజు,రమణ, మహేష్, హరీష్, తేజ, నాగరాజు, నందు, అమర్, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *