4, అక్టోబర్ 2023, బుధవారం

ఆడవాళ్ళను ఆట బొమ్మల్లా చూడకండి !

 మీడియా కో ఆర్డినేటర్ యం సతీష్ రెడ్డి హితవు



ఆడవాళ్ళును కొన్ని పార్టీల నాయకులు అటబొమ్మలాగ భావించి మాట్లాడటం విచారకరమని బీజేపీ తిరుపతి జిల్లా మీడియా కొ ఆర్డినేటర్ యం సతీష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఒక సిద్ధాంతం, దిశా నిర్దేశం వంటివి ఏమి లేనట్లు ఉన్నాయని, ఆడవాళ్ళకు కనీస మర్యాద ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం కూడా కొరవడిందని ఆవేదన వ్యక్తంచేశారు. 


వీళ్ళు ఒక పార్టీ పై మరో పార్టీ విమర్శ చేసుకోవటం లేదని ఆ పార్టీలు అన్ని కలిసి మూకుమ్మడిగా ఆడవారిపై దాడి చేస్తున్నారని తెలిపారు. ఈ పరిణామాలను గమనిస్తున్న యువత కూడా పెడదారి పట్టే అవకాశం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఒక పార్టీ వాళ్ళేమో నాయకుల భార్యలను తిడుతూ, ఉంటే మరో పార్టీ వాళ్ళు మహిళా నాయకులను తిడుతూ వారివారి వ్యక్తిగత జీవితాలను మీడియా ముందు పెడుతున్నారని అన్నారు. ఒకరైతే మీడియా ముఖంగా అది ఇది అని మాట్లాడుతున్నారని తెలిపారు. అంత కుసంస్కారం ఉన్న నాయకులు మనకు అవసరమా అని ప్రశించారు. ప్రశ్నిస్తా అని వచ్చినవారు కూడా అధికార దాహంతో ఆడవారిపై రెచ్చిపోయి మాట్లాడటం ఏమిటో అర్థం కావట్లేదనీ ఆవేదన చెందారు. ఇప్పటికైనా పార్టీలు మహిళల పట్ల కనీస మర్యాదను పాటించి సమాజ హితం కోరాలని కోరారు. నాయకుడు మాట్లాడే ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ప్రతి నాయకుడు మీడియా ముందు నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని సతీష్ రెడ్డి అన్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *