16, అక్టోబర్ 2023, సోమవారం

18 నుండి కాణిపాకం పిరమిడ్ లో సంకల్ప ధ్యాన యజ్ఞం

అక్టోబర్ 18 వ తేదీ నుండి 7 రోజులపాటు సంకల్ప ధ్యాన యజ్ఞం  జరుగుతుందని చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ,  గ్లోబల్  స్పిరిచువల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి గోపాల కృష్ణమూర్తి పత్రికలకు విడుదల చేసిన ఒక బులెటిన్ లో తెలియ జేశారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహా శక్తి క్షేత్రం నందు 7 రోజులపాటు సామూహిక సంకల్ప ధ్యాన యజ్ఞం,  భగవద్ గీత ధ్యాన సప్తాహం జరుగుతుందని అన్నారు.


బైరెడ్డిపల్లి కి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్  యం. రేవతి ఆధ్వర్యంలో ప్రతి రోజూ సాయంత్రం 6గంటల 30 నిముషాల నుండి 8 గంటల 30 నిముషాల వరకు భగవద్ గీత ప్రవచనాలు ఉంటాయన్నారు.
చిత్తూరు జిల్లా లోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ బి గోపాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రతి రోజు ఉదయం 11 గంటల 30 నిముషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిముషాల వరకు వివిధ అంశాలపై ఆత్మ జ్ఞాన భోధన ఉంటుందన్నారు. పతి రోజు ఉదయం మరియు సాయంత్రం సామూహిక సంకల్ప ధ్యానo, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.


ఈ 7 రోజుల ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే వారందరికీ ఉచిత వసతి మరియు రుచికరమైన శాఖాహార భోజనం ఏర్పాటు చేయడం జరుగు తుందన్నారు. ఈ ప్రాంగణంలో 3 రోజులు బస చేసి సంకల్పం చేసుకొని ధ్యానం చేస్తే వారి సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందన్నారు. ఆత్మ జ్ఞానంతో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలి అను కొనే వారు, తమ సమస్యలకు పరిష్కార మార్గం కావాలనుకునే వారు తప్పనిసరిగా ఈ నెల 18 వ తేదీ నుండి ప్రారంభo కాబోయే 7 రోజుల ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చే వారందరూ  తప్పనిసరిగా తమ ఆధార్ జేరాక్స్ కాఫీనీ ఇవ్వ వలసి ఉంటుంది అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సధ్వినియోగం చేసుకుని  విజయవంతం చేయాలని కోరారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *