30, అక్టోబర్ 2023, సోమవారం

ఆర్టీసీ బస్సు డ్రైవరుపై దాడికి నిరసన



ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కావలిలో దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలిపి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ .నాగరాజు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ విభాగంలో డ్రైవర్గా పనిచేస్తున్న రామ్ సింగ్ విధి నిర్వహణలో ఉండగా దారి కల్పించాలని హారన్ కొట్టినందుకు కావలిలోని అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది బస్సును ఆపి డ్యూటీలో ఉన్న డ్రైవర్ని కిందికి దౌర్జన్యంగా దించి నడిరోడ్డులో పిడుగుద్దులతో, కాళ్ళతో తన్ని సుహా తప్పిపోయే విధంగా కొట్టడాన్ని ఖండించారు. 


దాడి చేసిన అధికార పార్టీకి సంబంధించిన అనుచరులపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కావలి పోలీస్ అధికారులు కొంతమందిని మాత్రం  అరెస్టు చూపించి దీనికి ముఖ్య కారుకులైన వారిని అరెస్టు చేయకపోవడం  శోచనీయం అన్నారు. వెంటనే సంఘటనకు ముఖ్య కారకుడైన సూత్రధారిని అరెస్టు చేసి డ్రైవర్ రామ్ సింగ్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటియుసి గౌరవ సలహాదారులు వి సీ గోపీనాథ్ , ఏఐటియుసి నాయకులు దాసరి చంద్ర, ఏ కే.రమాదేవి, పి.రఘు, లతా పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *