5, అక్టోబర్ 2023, గురువారం

మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

చిత్తూరు మున్సిపల్  కమిషనర్, హెల్త్ ఆఫీసర్  జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే దశల వారి పోరాటం తప్పదని హెచ్చరించారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్  పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అధికారుల జాప్యానికి వ్యతిరేకంగా  చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఏఐటియుసి నాయకత్వంలో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మరియు ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు యస్.నాగరాజు మాట్లాడుతూ  కార్మికులు తక్కువగా ఉన్నచోట ఎక్కువగా ఉన్న కార్మికులను  మార్పు చేసి కార్మికులకు పని భారం తగ్గించాలని కోరారు. కార్మికులను  మార్పు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్ల పనిభారంతో కార్మికులకు  ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.  పుష్కట్ మరమత్తు చేయాలని,  పుష్కట్కు ఇద్దరు కార్మికులను కేటాయించాలని అనేక దఫాలు అధికారుల దృష్టికి తెస్తున్న మరమ్మతుకు నోచుకోకపోవడం , కేటాయించకపోవడం బాధాకరమన్నారు.  కార్మికులకు బకాయి పడ్డ యూనిఫారం,  సోపు, నూనె, చెప్పులు ఇవ్వాలన్నారు. రానున్నది వర్షాకాలం అయినందున ప్రతి మగ, మహిళా కార్మికునికి రైన్ కోట్ ఇవ్వాలని, మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాసం కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం  కల్పించడానికి చర్యలు తీసుకోవాలని గత నెల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్ , హెల్త్ ఆఫీస్ కు సమర్పించినప్పటికీ సమస్యల పరిష్కారం కాలేదన్నారు. ఇందుకు ఈ రోజు నిరసన చేయవలసి వచ్చిందని అన్నారు .ఇప్పటికైనా కమిషనర్ , హెల్త్ ఆఫీసర్ గారు జోక్యం చేసుకొని తమ పరిధిలోని కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు .లేనిపక్షంలో వివిధ రూపంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు

 నిరసన అనంతరం అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్ కు వినతి పత్రం సమర్పించారు. సమస్యలను  కమిషనర్ , హెల్త్  ఆఫీసర్  దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈ నిరసన కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ సలహాదారులు వి. సి. గోపీనాథ్ ఏఐటీయూసీ నాయకులు కే.మణి , డి.దొరస్వామి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జయశంకర్, సురేష్, సుగుణ, వినాయక, సుకన్య ,చిత్ర, రవి, ఈశ్వర్ ఇతరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *