హల్లో కిడ్స్ లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవ సంబరాలు
ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని స్థానిక గురు నగర్ కాలనీ లోని హల్లో కిడ్స్ పాటశాలలో అత్యంత ఘనంగా ఫుడ్ కార్నివాల్ ను నిర్వహించడమే కాక వచ్చిన సందర్శకులచే ప్రశంసల వర్షం కురిపించడం జరిగిందని హల్లో కిడ్స్ కరస్పాండెంట్ డాక్టర్ బి ఎల్ వి లోహిత్ కుమార్, డైరెక్టర్ పవిత్ర లోహిత్ పత్రికలకు విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుత తరుణంలో చిన్నారులు జంక్ ఆహార పదార్థాలకు అలవాటు పడి వాటినీ స్వీకరించడం ద్వారా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ రోగాల బారిన పడి తల్లి తండ్రులు కలలు గనే తమ అధ్భుత మైన భవిష్యత్తును తమ చేజేతులా నాశనం చేసుకుంటున్నారన్నారు.
అటువంటి ఈ తరుణంలో ఫుడ్ కార్నివాల్ ను నిర్వహించి చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా గల ఆహార పదార్థాలను ప్రదర్శించి వాటినీ తీసుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలను కేవలం చిన్నారులకే కాక వారి తల్లి తండ్రులకు కూడా వివరిస్తే తద్వారా చిన్నారుల్లోను, వారి తల్లి తండ్రుల లోను మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. తద్వారా తమ చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే సదవకాశం కలుగుతుందన్నారు. ముందుగానే చిన్నారుల తల్లి తండ్రులకు ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా గల ఆహార పదార్థాలను గురించి కౌన్సిలింగ్ ఇచ్చి వారి ద్వారానే అటువంటి ఆహార పదార్థాలను హల్లో కిడ్స్ లో ప్రదర్శించడం జరిగిందన్నారు.
అంతేగాక ఎంతో అనుభవం ఉన్న అధ్యాపక బృందం మరియు మేనేజ్మెంట్ పర్య వెక్షణలో తల్లితండ్రులకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కార్య క్రమంలో చిన్నారుల తల్లి తండ్రులు, వారి బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు , పట్టణ ప్రముఖులు, తల్లి తండ్రులు గా ఉన్న డాక్టర్లు అధ్యాపక బృందం పాల్గొనడం జరిగిందని అన్నారు. ఫుడ్ కార్నివాల్ ను సమర్థవంతంగా నిర్వహించడం లోనూ, అధిక ప్రొటీన్లు, విటమిన్లు గల ఆహార పదార్థాలను ప్రదర్శించడం లోను. వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం లోను, ఫుడ్ కార్నివాల్ ప్రోగ్రామ్ అద్భుతంగా నిర్వహించి నందున వచ్చిన ప్రతి ఒక్కరూ హల్లో కిడ్స్ మేనేజ్మెంట్ ను, అధ్యాపక బృందాన్ని మెచ్చుకోవడం జరిగిందన్నారు.
ఈ విజయానికి కారకులైన అధ్యాపక బృందాన్ని, ప్రతి విషయం లోను సహాయ సహకారాలను అందించిన చిన్నారుల తల్లి తండ్రులను, విచ్చేసిన సందర్శకులను పట్టణ ప్రముఖులను హృదయ పూర్వక అభినందనలు మరియు కృతజ్ఞాతలు తెలియజేశారు.