రామాలయంలో మోడి పేరుతో అర్చనలు
ప్రధాని నరేంద్ర మోడి గత 22 సంవత్సరాలుగా, నిరంతారాయంగా , ఒక్క రోజు విరామం లేకుండా ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తు, కొనసాగుతున్నరని తిరుపతి జిల్లా బీజేపీ అద్యక్షుడు బెస్త చంద్రప్ప కొనియాడారు. ఈ సందర్భంగా తిరుపతిలోని రాములవారి దేవాలయంలో శనివారం మోడి పేరుతో అర్చనలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు.
ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అద్యక్షుడు బెస్త చంద్రప్ప మాట్లాడుతూ.. మన ప్రధాని నరేంద్ర మోడి ఈ రోజున అక్టోబర్ 7 వ తారీఖు 22 సంవత్సరాల క్రితం అంటే సరిగ్గా ఈ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. అప్పటినుండి భారతదేశాన్ని ప్రపంచంలో గురు స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్న మోడికి కావలసిన శక్తి సామర్ధ్యాలు ఆరోగ్యము ప్రసాధించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మునిసుబ్రమణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకశ్ రెడ్డి, సామంచీ శ్రీనివాస్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెనబాల చంద్రశేఖర్, ప్రశాంతి రాజ్, మహిళా అధయక్షురాలు వేదవతి రాయల్, వరప్రసాద్, మీడియా కో ఆర్డినేటర్ యం సతీశ్ రెడ్డి, శ్రీహరి, ఇతర బీజేపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

