29, అక్టోబర్ 2023, ఆదివారం

జిల్లా హౌసింగులో రూ. 100 కోట్ల స్కాం !?

 BJP మీడియా కో ఆర్డినేటర్ యం సతీష్ రెడ్డి 



ఉమ్మడి చిత్తూరు జిల్లా హౌసింగ్ లో సుమారు రూ. 100 కోట్ల స్కాం జరిగిందని బీజేపీ జిల్లా మీడియా కో ఆర్డినేటర్ యం సతీష్ రెడ్డి ఆరోపించారు. ఒక ప్రణాళికా బద్ధంగా ప్రతి ఊరిలో కొందరు దళారీలు సామాన్యుల పేరుతో ఇళ్ళ కోసం దరఖాస్తులు చేశారని తెలిపారు. దానికి అధికారులు సైతం కిమ్మనకుండా అనుమతులు మంజూరు చేశారని చెప్పారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మొత్తం బిల్లులను లబ్దిదారుల ఖాతాల్లో జమ అయిన  తరువాత ఆ ధనాన్ని   మోసపూరితంగా  కాజేస్తున్నరని  ఆరోపించారు. కొందరిని బెదిరించి కొందరిని ఎమార్చి మొత్తం డబ్బులు దళారీలు స్వంతం చేసుకుంటున్నారని చెప్పారు.


దీనికి బడా నాయకుల అండదండలు ఉన్నాయని చెప్పారు. ప్రతి ఇల్లు కట్టాలి అంటే జీయో టాగింగ్ అవసరం అని కడగాలు, గోడలు ఎక్కిన తరువాత, మోల్డ్ పోసిన తరువాత ఇలా అనేక సార్లు ఫోటోలు తనిఖీలు జరిగిన తరువాత కానీ బిల్లులు ఇవ్వ కూడదు అన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు అధికారులు కలిసి పై ప్రక్రియ ఏమి లేకుండానే ఇల్లు వచ్చినట్లు లబ్దిదారునకు తెలియకుండానే మొత్తం డబ్బులు ఒక లక్షా నలభై ఏడువేల బిల్లులు లబ్దిదారుల ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. తరువాత సంబంధిత ఇంచార్జి నాయకుని రంగ ప్రవేశంతో ముసలి వాళ్ల దగ్గర అయితే ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చెయ్యాలి అని వారికి తెలియకుండానే డబ్బులు తీసుకొన్న సందర్బాలు ఉన్నాయి. అలానే ఒకే ఇంట్లో యజమాని  తండ్రి కొడుకు భార్య ఇలా నలుగురికి ఇల్లు మంజూరైన ఆ డబ్బులు సంబంధిత నాయకులకు చేరవలసినదే అన్నారు. లేకుంటే పోలీస్ కేసులు కూడా పెట్టిన ఉదంతాలు ఈ జిల్లాలో అనేకం ఉన్నాయని ఆయన తెలిపారు. కే వీ బి పురం మండలం కోట మంగళం గ్రామంలోనే 26ఇళ్లకు గాను సుమారు 40లక్షల రూపాయలు  మంజూరై ఒక నాయకుని ద్వారా ఆ డబ్బులు మొత్తం తిరిగి లబ్దిదారుల నుండి తీసుకోవడం జరిగిందని వివరించారు.


అలాగే ఈ ఇళ్లకు మంజూరు అయిన సిమెంట్, కమ్మి, ఇసుక, గుల్లను సంబంధిత అధికారి అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఆ గ్రామ ప్రజలు యం పిడి ఓ కార్యాలయం లో ధర్నా చేసినా, స్పందనలో అర్జి పెట్టినా, జిల్లా కలెక్టర్ కి  5/6/2023 వ తేదీన అర్జీ ఇచ్చినా ఇంత వరకు కనీస తనిఖీలు జరగలేదంటే,  ఇందులో పెద్ద పెద్ద నాయకులే ఉన్నారని తెలుస్తుందన్నారు. ఈ ఒక్క మండలం లోనే కాదు ప్రతి మండలంలో ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నాయని, ఈ విధంగా మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 100 కోట్ల రూపాయలు స్కాం జరిగిందని పేర్కొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ స్కాంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *