19, అక్టోబర్ 2023, గురువారం

తంబళ్లపల్లి టిడిపికి దిక్కెవరు?

అందుబాటులో లేని ఇంచార్జి శంకర్ 

ప్రవీణ్ కుమార్ కు తిరిగి పార్టీ ఆహ్వానం

నియోజకవర్గ అందుబాటులో పర్వీన్ తాజ్

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి దశ దిశ నిర్దేశం కరవయ్యింది. జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గం గురించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోవడం లేదు. మూడు నెలల కాలానికి 2021 డిసెంబరు 24న తిరిగి ఇన్చార్జిగా నియమితులైన శంకర్ యాదవ్ కూడా నియోజకవర్గానికి ముఖం సాటేశారు. 40 రోజులుగా చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బొగ్గు మంటున్నాయి. నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, కళ్లకు గంతలు కట్టుకోవడం, కొవ్వొత్తుల ర్యాలీలు వంటి కార్యక్రమాలతో రాష్ట్రం హోరెత్తిపోతుంది. రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా చంద్రబాబుకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయితే ఒక తంబళ్లపల్లె నియోజకవర్గంలో మాత్రం స్థబ్ధతగా ఉంది. అనుకున్న స్థాయిలో ఆందోళనలు  నడవడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహ కార్యదర్శి ఎస్ ఎం పర్వీన్ తాజ్ ఆధ్యర్యంలో మాత్రం అక్కడక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. నాయకులకు అందుబాటులో ఉండాల్సిన ఇంచార్జ్ శంకర యాదవ్ కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమాచారం.

B.కొత్తకోటలో పర్వేన్ తాజ్ అధ్వర్యంలో ఆందోళన

తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తంబళ్లపల్లె నియోజకవర్గంలో సాగునీటిపారుదల ప్రాజెక్టులను పరిశీలించడానికి వెళ్లగా అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడును అడుగడుగునా అడ్డుకున్నారు. అలాగే ఆయన మదనపల్లికి రావడానికి వస్తుండగా అంగళ్ళ వద్ద చంద్రబాబు నాయుడును వైసీపీ నాయకులు మరోసారి అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, స్వాగత కారణాలను చింపి వేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మీద దాడులు చేశారు. వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు మీద కూడా రాళ్లూ రువ్వారు. ఇది జరిగినప్పుడు తంబళ్లపల్లి ఇంచార్జ్ శంకర్ యాదవ్ అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన మీద పోలీసు కేసు నమోదు కాలేదు. పలమనేరుకు చెందిన అమరనాధ రెడ్డి, పీలేరుకు చెందిన కిషోర్ కుమార్ రెడ్డి, చంద్రగిరికి చెందిన నాని, పున్గానురుకు చెందిన చల్లబాబు, నెల్లూరుకు చెందిన ఉమా తదితర నాయకులపై కేసులు నమోదు చేశారు. సుమారుగా 300 పైగా కార్యకర్తలు కర్తల కార్యకర్తలపై వివిధ సెక్షన్ల కింద నవోదయ్యాయి. ఈ కేసులోనే చంద్రబాబు నాయుడు మీద కూడా హత్యాయత్నం కేసును నమోదు చేశారు. సుమారు వందమందికి పైగా కార్యకర్తలను పోలీసుల అరెస్టు చేశారు. మరి కొంతమంది స్వచ్ఛందంగా అరెస్టయి జైలుకు వెళ్లారు.


ఈ సంఘటన జరిగిన తర్వాత తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర మీద కేసు ఎందుకు నమోదు కాలేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తెలుగుదేశం పార్టీ నేతలు కింది నుంచి పై వరకు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్తగా మీద కూడా కేసులో నమోదు కాగా శంకర్ యాదవ్ మీద ఎందుకు నమోదు కాలేదు అన్నది ఇప్పటికీ తెలుగుదేశం శ్రేణులను తొలసి వేస్తున్న ప్రశ్న. ఈ సంఘటన తర్వాత కొంత కాలానికి చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలలో పార్టీ ఇంచార్జ్ శంకర్ యాదవ్ పాల్గొనలేదని తెలుస్తోంది. నియోజకవర్గానికి ఇన్చార్జి ఉన్నారా లేదా అన్న ప్రశ్న స్థానిక నాయకులు కార్యకర్తలను తొలచి వేస్తుంది.


తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొదటి నుంచి అనిపిరెడ్డి లక్ష్మీదేవమ్మకు తెలుగుదేశం పార్టీలో గట్టిపట్టు ఉంది. ఆమె 1985, 1994 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున లక్ష్మీదేవమ్మ కుమారుడు అనిపిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ను బీసీ వర్గాలకు చెందిన శంకర్ యాదవ్ కు ఇవ్వడంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన జి శంకర్ యాదవ్ ఓటమిపాలయ్యారు. ఆనాటి నుంచి నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తిరిగి నవీన్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన కూడా సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం.


మదనపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహ కార్యదర్శి ఎస్ ఎం పర్వీన్ తాజ్ తరచుగా తంబళ్లపల్లి  నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన తర్వాత పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులను, నాయకులను కలుసుకుంటున్నారు. మైనారిటీ, బిసి, మహిళగా తనకు తంబళ్లపల్లి సీటును రానున్న ఎన్నికలలో కేటాయించాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నారు. చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకురాలిగా  కూడా వ్యావహరిస్తున్నారు. ఆమె మీద ఇప్పటికే పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. పార్టీ కోసం పోరాడుతున్న తనకు రానున్న ఎన్నికల్లో సీటు ఇవ్వడం సమంజసంగా ఉంటుందని స్థానాన్ని కోరారు. అధిష్టానం కూడా పర్వేన్ తాజ్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. బీసీ మహిళగా, మైనారిటీ మహిళగా తనకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చిన తరువాత తంబళ్లపల్లి రాజకీయం ఒక కొలిక్కి రానుంది.




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *