27, అక్టోబర్ 2023, శుక్రవారం

పట్టుగుడ్ల ఉత్పాదక కేంద్రాన్ని పునః ప్రారంభించాలి: BJP

 



జిల్లా కేంద్రమైన చిత్తూరులో  మూతపడిన పట్టు గుడ్ల ఉత్పాదక కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని  బిజెపి బిజెపి సీనియర్ నాయకులు చిట్టిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి, మీడియా ఇంచార్జ్ ఎంజి రామభద్ర  డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మూతపడిన పట్టు గుడ్ల ఉత్పాదక కేంద్రాన్ని పరిశీలించారు. మూతపడిన పట్టు గుడ్ల ఉత్పాదక కేంద్రాన్ని తిరిగి ప్రరంబిమ్చాకుంటే, ఆక్రమణలకు గురయ్యే ప్రమాదంఉందని ఆందోళన వ్యక్తం చేశారు.



కేంద్ర ప్రభుత్వం చిత్తూరులో పట్టుపురుగుల గుడ్లు, ఉత్పాదక కేంద్రాన్ని 1995 లో ప్రారంభించింది.  ఈ కేంద్రం లో పట్టు గుడ్లు ఉత్పత్తి, ప్రాంతీయ కేంద్రాలను అనుసంధానిస్తూ నాయకత్వం వహించడం, నాణ్యతాపరమైన గుడ్లను ఉత్పత్తి చేయడం, అధ్యయనం,  పరిశోధనలు చేయడం, కేంద్ర ప్రభుత్వానికి క్షేత్రస్థాయి అనుభవాలను తెలియపరచడం లాంటి కార్యక్రమాలను ఈ సెంట్రల్ సిల్క్ బోర్డ్ కేంద్రం చేపడుతూ ఉండింది. చిత్తూరు జిల్లాలోని రైతులకు ఇతోదికంగా సేవ చేస్తూ వచ్చిన ఈ కేంద్రం జిల్లాలో రైతులు పట్టుపురుగు పెంపకాలను తగ్గించినప్పుడు క్రమంగా ఈ సంస్థ కార్యక్రమాలు తగ్గిపోతూ 2017 లో పట్టు గుడ్లు ఉత్పత్తి నిలిచిపోయింది. 


అప్పటి నుండి  రాష్ట్ర ప్రభుత్వ సెరికల్చర్ శాఖ కూడా ఈ కేంద్రాన్ని వినియోగించుకోలేదు. ప్రస్తుతం ఈ సిల్క్ బోర్డు ఉత్పాదక  కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఈ కేంద్రంలోకి తరలించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రైతుల కోసం పట్టుపురుగుల గుడ్లు ఉత్పాదక కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మేలిమి రకాలను ఉత్పత్తి చేసీ,  రైతులకు సలహాలు సూచనలు అందజేయాలని కోరారు. అంతేకానీ ఈ భవనాలను రైతు సంక్షేమం కొరకు కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించకూడదు అని బిజెపి చిత్తూరు డిమాండ్ చేశారు. 


 ఒకవేళ రాష్ట్ర సెరికల్చర్ డిపార్ట్మెంట్ వీటిని సద్వినియోగ పరచుకోకపోతే ఈ భవనాలను తాత్కాలికంగా నవోదయ పాఠశాల స్థాపనకు అప్పగించాలన్నారు. జిల్లా విభజన తర్వాత చిత్తూరు జిల్లా కేంద్రం ఎలాంటి కేంద్రీయ విద్యాసంస్థల ఏర్పాటుకు నోచుకోలేదు కాబట్టి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చిత్తూరు జిల్లా కేంద్రంలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని భారతీయ జనతా పార్టీ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో  బిజెపి సీనియర్ నాయకులు చిట్టిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి, మీడియా ఇంచార్జ్ ఎంజి రామభద్ర పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *