9, అక్టోబర్ 2023, సోమవారం

కోర్టుల్లో చంద్రబాబుకు దక్కని ఉరట



చంద్రబాబు అభిమానులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోమవారం నిరాశే మిగిలింది. సోమవారం కోర్టు తీర్పులు ఉరట ఇవ్వలేదు. తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎంతో అత్రుతంగా సోమవారం కోర్టు తీర్పుల కోసం వేచిఉన్నారు. ఉదయం నుండి TVలకు అతుక్కుపోయారు. తొలుత హై కోర్టు  స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో, ఫైబర్ గ్రిడ్, పుంగనూరు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు పెట్టుకున్న బెయిలు పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు నీరుగారిపోయారు. పుంగనూరు అల్లర్ల కేసులో ఇందితులు అందరికి ఇప్పటికే  బెయిలు వచ్చింది. కావున ఈ కేసులో అయినా, బెయిల్ వస్తుందని తెదేపా నాయకులు భావించారు. దీంతో మరి కొద్ది రోజులు చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉండాల్చిన పరిస్థితి ఏర్పడింది.


 ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై గతవారమే  విచారణ పూర్తి అయ్యింది.  తీర్పును మాత్రం  ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. దీనిపై ఇవాళ తీర్పు వెలువరించిన ఏసీబీ కోర్టు.. రెండు పిటిషన్లను తోసిపుచ్చింది.  సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా పడుతుందని అంతా భావించారు. కానీ ఏసీబీ కోర్టు మాత్రం ఇవాళ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. 


అన్నట్లుగానే ఇవాళ లంచ్ బ్రేక్ తర్వాత ఏసీబీ కోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే చంద్రబాబు ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినా బెయిల్ కావాలని కోరారు. అలాగే సీఐడీ గతంలో ఓసారి రెండు రోజుల పాటు జైల్లో కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపినా మరోసారి ఐదు రోజుల కస్టడీ కావాలని కోరింది. ఈ రెండు పిటిషన్లపై ఏసీబీ కోర్టు ఏకకాలంలో విచారణ జరిపింది. ఇరువైపులా న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు న్యాయవాదులు స్కిల్ కేసులో ఇతర నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసినందున ఏ 37గా ఉన్న చంద్రబాబుకు కూడా బెయిల్ కావాలని కోరారు. అలాగే సీఐడీ గతంలో కస్టడీలో చంద్రబాబు తమకు పూర్తిగా సహకరించలేదని, కాబట్టి మరోసారి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. కానీ ఏసీబీ కోర్టు మాత్రం ఈ రెండు పిటిషన్లనూ అంగీకరించలేదు. తోసిపుచ్చింది.


ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబుపై గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఈ క్వాష్ పిటిషన్ పై సోమవారం సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరపున న్యాఎవడి సోమవారం వాదనలు వినిపించారు. మంగళవారం ప్రభుత్వం తరపున వాదనలను వినిపించనున్నారు. అనంతరం తీర్పు వెలువడనుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *