3, అక్టోబర్ 2023, మంగళవారం

టీడీపీకి షాక్ ఇచ్చిన టైమ్స్ నౌ సర్వే

 



ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి టైమ్స్ నౌ సర్వే షాక్ ఇచ్చింది. అధికార YCPకి మాత్రం భారీ ఉరటనిచ్చింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, 25కు 24 నుంచి 25 ఆ పార్లమెంట్ స్థానాలు అధికార YSR కాంగ్రెస్ పార్టీకి వస్తాయని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది.  ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వస్తే ఒక పార్లమెంట్ స్థానం వస్తుందనీ, లేకుంటే అది కూడా లేదని ఈ సర్వే చెప్పింది. ఈ సర్వేతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు  వ్యక్తమవుతున్నాయి. తాము అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ ఈ సర్వేను చాలా తేలిగ్గా తీసుకుంది. గత ఎన్నికల సర్వేను పొరబాటున ఇప్పుడు విడుదల చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి NB సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.


ఇటేవల విడుదలైన సి ఓటర్ సర్వేలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీకి సానుభూతి వెల్లువెత్తుతుందని పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేన తోడు కావడంతో పార్టీ బలం మరింత పెరిగిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు విముఖతతో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో జగన్ ప్రజా వ్యతిరేక పాలన తమను గెలిపిస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశాభావంతో ఉన్నారు. ఇందుకు తోడు సి ఓటర్ సర్వే తెలుగుదేశం పార్టీ నాయకులకు మరింత బలం చేకూర్చింది. అయితే సోమవారం విడుదలైన టైమ్స్ నౌ సర్వేలో తెలుగుదేశం పార్టీ ఆశల మీద నీళ్లు కుమ్మరించింది. రాష్ట్రంలో వైసిపి పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించింది. రానున్న ఎన్నికల్లో తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు డైలమాలో పడ్డారు. తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు గత మూడు వారాలుగా ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు పల్లెలకు కూడా ప్రాకుతున్నాయి. ఫలితంగా రానున్న ఎన్నికల్లో తమదే విజయమని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.


టైమ్స్ నౌ పత్రిక సర్వేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి NB సుధాకర్ రెడ్డి చాలా తేలిగ్గా తీసిపారేశారు. ఆ సర్వే వాస్తవాలకు ఆమడ దూరంలో ఉందని స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీ డబ్బులు ఇచ్చి తమకు అనుకూలంగా ఈ సర్వే ను రాయించుకుందని పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా అధికార పార్టీలో జోష్ వచ్చి, మరింత ఉత్సహంతో కార్యకర్తలు పనిచేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని తెలిపారు. అయితే, ఈ  సర్వేతో రానున్న ఎన్నికల్లో తామే  గెలుస్తామన్న  భ్రమలో వైసీపీ నాయకులు పండగ చేసుకుంటూ ఉంటారని పేర్కొన్నారు. చాప కింద నీరులా రానున్న ఎన్నికల్లో 24 పార్లమెంటరీ స్థానాలను, 150 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని అధికార పీఠాన్ని అధిరోహించడం తద్యమని ఎన్ బి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *