30, అక్టోబర్ 2023, సోమవారం

కుప్పం అధికారులపై చర్యలు తీసుకోవాలి

                                     

            .

               

కుప్పం అంగనవాడి ప్రాజెక్టులో నిరంతరం అంగన్వాడీలను వేధిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, అంగనవాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే లలిత, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రమీలలు మాట్లాడుతూ కుప్పం ప్రాజెక్టు అధికారి తమ సమస్యలను పరిష్కారం చేయకుండా మాపై కక్ష సాధింపు చర్యలకు నిరంతరం దిగుతున్నదని ఇప్పటికే ప్రతినెల వేతనాలు కోత విధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 


గతంలో కలెక్టర్ కి సమస్యలపై రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ ఐసీడీఎస్ ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినా అది జరగలేదు. దీంతో ఇంకా రెచ్చిపోయిన ప్రాజెక్టు అధికారి రాష్ట్రవ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కారం కోసం గత నెల 25న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చి సందర్భంలో కుప్పం నుంచి అందరూ బయలుదేరి వెళ్ళగా మధ్యలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా 25న కుప్పంలో రాస్తారోకో నిర్వహించి కుప్పంలో ఉన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా  ఇదే అదునుగా చూపి పార్టీ మీటింగ్ కు అంగన్వాడీలు వెళ్లారని షోకాస్ నోటీసులు ఇచ్చారు. షోకాస్ నోటీసులకి సమాధానం ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే 50 మందికి వేతనాల కోత విధిస్తూ, ఇద్దరు నాయకులని విధుల నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు పంపారు. దీనిని వారు తీవ్రంగా ఖండించారు. కుప్పంలో అధికార పార్టీ నాయకులు ఏది చెప్తే అది ఆ అధికారి వింటూ వేధింపులు గురిచేయడం దుర్మార్గమన్నారు. ఈ వేధింపులు మానుకోవాలని పదే పదే ఉన్నతాధికారులకు చెబుతున్నప్పటికీ ఎందుకు ఆ అధికారిపై చర్యలు తీసుకోవడం లేదో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని తప్పుడు పద్ధతిలో వేధింపులు గురిచేస్తున్న కుప్పం ప్రాజెక్టు అధికారపై చర్యలు తీసుకోకపోతే జిల్లా, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తామని హెచ్చరించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *