4, అక్టోబర్ 2023, బుధవారం

టిడిపి ఆందోళననకు నేటితో తెర

రేపటి నుండి ఇంటింటికి తెలుగుదేశం
బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీపై ప్రచారం
మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ళడం
వైకాపా అరాచక పాలనపై అవగాహన


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు నేతితో తెర దించాలని తెదేపా అధిష్టానం నిర్ణయించింది. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నిర్ణయించింది. తెదేపా ప్రణాళిక గురించి ప్రచారం చేయాలని నాయకులను కోరారు.బుదవారం మాజీమంత్రి అమరనాధ రెడ్డి 
పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం గండ్రాజు పల్లి పంచాయతీ పరిధిలో గండ్రాజు పల్లి, ఆల కుప్పం, బసవరాజుపురం, జంగాలపల్లి, బండిళ్ళు, అనంతపురం, ఉగిని గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించాను. ఈ సందర్భంగా బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడంతో పాటు వైకాపా అరాచక పాలనపై ఆయన అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణి చేశారు. గత 23 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు, ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, ధర్నాలు అంటూ ఆందోళనతో బిజీగా ఉంటున్నారు. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పూర్తి దృష్టి ఆందోళన కార్యక్రమాల మీదనే కేంద్రీకరించారు. ఆందోళన కార్యక్రమాలను రోజురోజుకు ఉధృతం చేయడం ఎలా అన్న విషయం మీదనే మల్లగుల్లాలు పడుతున్నారు. ఆందోళన కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒకటి మాత్రమే గెలుచుకుంది. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు ఒక్కరే గెలుపొందారు. 13 నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు ఓటమిపాలుగా, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అలాగే తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటు స్థానాలు కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఎన్నికల నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పగడ్బందీగా రానున్న ఎన్నికల కోసం సమాయత్తమవుతుంది. రెవెన్యూ, పోలీస్ అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన నేతల మీద కేసులను బనాయించడం, వారి అరెస్టు చేసి జైలుకు తరలించడం ద్వారా వారిలో మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. అలాగే భారీగా జిల్లాలో బోగస్ ఓట్లు నమోదవుతున్నాయి. వాటిని దీటుగా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొనలేకపోతోంది. అధికారం వైసిపి పార్టీది కావున, తెలుగుదేశం పార్టీ మాటలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లాలో ఓట్ల నమోదు ఏక పక్షంగా నడుస్తోంది.


చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి దిశా నిర్దేశం కరువైంది. ఆయన తనయుడు లోకేష్ ఢిల్లీకి పరిమితమయ్యారు. ఆయన రాష్ట్రానికి వచ్చిన అరెస్టు చేస్తారనే అభిప్రాయం సర్వత్రా నెలకుంది. దీంతో తెలుగుదేశం పార్టీని ముందుంది నడిపించి, పార్టీని ఎన్నికలకు సమాయాత్తం చేసే నాయకత్వం కరువైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతసేపు ఆందోళన కార్యక్రమాలు తప్ప వైసీపీ చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి, అడ్డుకోలేకపోతున్నారు. వైసిపి నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని పార్టీ కార్యక్రమాలతో, పాటు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా నడిపిస్తున్నారు. పార్టీ కరపత్రాలు, స్టిక్కర్లు వాలంటీర్ల ద్వారా పంపిణి చేస్తున్నారు. అలాగే అయా వార్డులో తెలుగుదేశం, వైసిపి పార్టీల ఓట్లను గుర్తించి నాయకులకు సమాచారం ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఓటర్ లిస్ట్ లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే జగనన్న ఆరోగ్య సురక్షా పథకం కింద మహిళలందరికీ హెల్త్చే చెకప్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన మహిళలకు ముఖ్యమంత్రి జగన్ ఫోటోలో ఉన్న బ్యాగులు, కరపత్రాలను అందజేస్తున్నారు. ఇలా అధికార వైసీపీ పార్టీ ఎన్నికలకు సమాయాత్తం అవుతుంటే, ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రం ఆందోళనలకే పరిమితమైంది.


అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటోంది. చాప కింద నీరులా ఎన్నికలకు సమాయత్తమవుతుంది.  వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు తమకు అనుకూలంగా చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల ఓట్లకు చెక్ పెడుతున్నారు. అలాగే తమకు అనుకూలంగా భారీ సంఖ్యలో బోగస్ ఓట్లను నమోదు చేయించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ద్రుష్టి పెట్టకపోవడంతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడిందే ఆటగా సాగుతోంది. కావున ఇక అందోళనలకు చెక్ పెట్టి, పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని అధిష్టానం నిర్ణయించింది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధికార పార్టీ అవినీతి, అక్రమాలు, అవకతవకలను ఇంటింటికి వెళ్లి ఎండగట్టనున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *